కేశినేని శ్వేత రాజీనామాకు ఆల్ ది బెస్ట్ చెప్పి ప్రోత్సహించిన గద్దె రామ్మోహన్

Kesineni Swetha: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకుంటోన్న పరిణామాలు ఆ పార్టీకి మింగుడు పడట్లేదు. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అనుసరిస్తోన్న ధోరణి- సీనియర్లను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తోంది. పార్టీని వీడి బయటికి వెళ్లిపోయేలా చేస్తోంది.

విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని వ్యవహారమే దీనికి నిదర్శనం. కుటుంబాలను చీలుస్తారంటూ ఇదివరకు కాకినాడ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. కేశినేని ఉదంతంలో వాస్తవ రూపాన్ని దాల్చాయి. నానికి వ్యతిరేకంగా ఆయన సొంత తమ్ముడు చిన్నిని ప్రోత్సహించారు.

Kesineni Swetha met TDP MLA Gadde Rammohan

దీని ఫలితంగా- కేశినేని నాని తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తెలుగుదేశానికీ గుడ్‌బై చెప్పాల్సిన పరిస్థితిని కలిగించింది. ఇది ఆయనతో ఆగేలా కనిపించట్లేదు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన కొందరు సీనియర్ నేతలను కూడా ఆయన తన వెంట పార్టీ నుంచి బయటికి తీసుకెళ్లొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి.

ఇందులో భాగంగా- విజయవాడ టీడీపీ యువ నాయకురాలు కేశినేని శ్వేత పార్టీకి రాజీనామా చేయనున్నారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికీ గుడ్‌బై చెప్పనున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్‌ కార్పొరేటర్‌గా గెలిచిన ఆమె తన పదవికి కూడా రాజీనామా చేయనున్నట్లు కేశినేని నాని తెలిపారు.

రాజీనామా చేయడానికి బయలుదేరి వెళ్లడానికి ముందు కేశినేని శ్వేత.. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నివాసానికి వెళ్లారు. ఆయనతో సమావేశం అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. తాను రాజీనామా చేయబోతోన్నాననే విషయాన్ని, అందుకు గల కారణాలను వివరించారు.

Kesineni Swetha met TDP MLA Gadde Rammohan

అనంతరం ఆమె గద్దె రామ్మోహన్ ఇంటి వద్ద తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. రాజీనామా చేయడానికి ముందు గద్దె రామ్మోహన్ ఆశీర్వాదాన్ని తీసుకున్నానని అన్నారు. మేయర్‌కు రాజీనామా పత్రాన్ని అందించిన వెంటనే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి గుడ్‌బై చెబుతానని తేల్చి చెప్పారు.

గద్దె రామ్మోహన్‌తో తన కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, రాజకీయ గురువుగా భావిస్తానని శ్వేత అన్నారు. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో ఆయన సహకారంతో తోటి కార్పొరేటర్లందరూ అభివృద్ధి చేశామని, అందుకే మర్యాదపూరకంగా కలిశానని వివరించారు. తన రాజీనామా నిర్ణయాన్ని తెలియజేయగా ఆల్ ది బెస్ట్ చెప్పారని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+