చెప్పా పెట్టకుండా మూసేశాడు: కేశినేని నానిపై ఆగ్రహం, ఫిర్యాదు
కేశినేని ట్రావెల్స్ ఉద్యోగులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. పది నెలలుగా తమకు జీతాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ సోమవారం కార్మిక శాఖ కమిషనర్‌ను కలిశారు.
విజయవాడ: కేశినేని ట్రావెల్స్ ఉద్యోగులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. పది నెలలుగా తమకు జీతాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ సోమవారం కార్మిక శాఖ కమిషనర్‌ను కలిశారు.
జీతాలు చెల్లించమని అడిగితే తమపై దాడి చేశారని ఉద్యోగులు ఆరోపించారు. తమకు రావాల్సిన మొత్తం ఇప్పించి, ఎంపీ కేశినేని నానిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

చెప్పా పెట్టకుండా ట్రావెల్స్‌ను మూసివేసి తమకు జీతాలు చెల్లించకుండా ముఖం చాటేశాడని ఆరోపించారు. ఏడాదిగా జీతాలు లేవని, దీంతో తాము అప్పులపాలయ్యామని, తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications