సికింద్రాబాద్- విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్ పై కీలక ప్రకటన.. సెప్టెంబర్ 7నుండి!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో రైల్వే ప్రగతికి బాటలు వేస్తూ వివిధ అభివృద్ధి ప్రాజెక్టులపై దృష్టి సారిస్తోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కొత్త రైల్వే లైన్ల ఏర్పాటు, వివిధ మార్గాలలో కొత్త రైళ్లు, కొత్త ట్రాక్ ల అభివృద్ధి, రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ తదితర కార్యక్రమాలతో రెండు తెలుగు రాష్ట్రాలలోనూ రైల్వే అభివృద్ధికి దోహదం చేస్తుంది.

శాతవాహన ఎక్స్ ప్రెస్ విషయంలో కీలక నిర్ణయం
ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో జరుగుతున్న అనేక పనుల నేపథ్యంలో వివిధ రైళ్ళ సమయాలు మార్పుతో పాటు, రైళ్ళ రూట్ లను మార్చడం వంటి పలు నిర్ణయాలను తీసుకున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ నుండి విజయవాడకు ప్రతిరోజు తిరిగే శాతవాహన ఎక్స్ప్రెస్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో కొద్దిగా కొంతకాలంగా ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఇక తాజాగా శాతవాహన ఎక్స్ప్రెస్ విషయంలో మళ్లీ అధికారులు కీలక ప్రకటన చేశారు.

Key announcement on Secunderabad-Vijayawada Satavahana Express from September 7th it will run as usual

Take a Poll

ప్రస్తుతం ఈ రూట్ లో శాతవాహన ఎక్స్ ప్రెస్
కాజీపేట జంక్షన్ మీదుగా సికింద్రాబాద్- విజయవాడ -సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే శాతవాహన ఎక్స్ప్రెస్ రైలును సెప్టెంబర్ 7వ తేదీ నుంచి యధావిధిగా నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటనలో వెల్లడించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనుల దృష్ట్యా శాతవాహన ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ వెళ్లకుండా వయా బైపాస్ చర్ల, మల్కాజ్గిరి మీదుగా కాచిగూడ వరకు ప్రస్తుతం వెళుతుంది.

యధావిధిగా శాతవాహన రైలు
అయితే దీనిని వచ్చే నెల 7వ తేదీ నుంచి మౌలాలి, కాజీపేట, వరంగల్ మీదుగా యధావిధిగా విజయవాడకు నడపనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇక తాజా ప్రకటనతో సికింద్రాబాద్, విజయవాడ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు గత కొంతకాలంగా చోటుచేసుకున్న ఇబ్బంది తొలగిపోనుంది.

మార్చి 15 నుండి శాతవాహన రూట్ మార్పు
కాగా ఇంతకుముందు విజయవాడ జంక్షన్ లో ఉదయం 6.25కు బయలుదేరి మధ్యాహ్నం 12.55కు సికింద్రాబాద్ స్టేషన్ కు చేరాల్సిన శాతవాహన ఎక్స్ ప్రెస్ రూటులో మార్చి 15వ తేదీ నుండి మార్పు చేశారు. మార్చి 15వ తేదీ నుంచి శాతవాహన ఎక్స్ ప్రెస్ రైలును సికింద్రాబాద్ స్టేషన్ కు కాకుండా కాచిగూడ స్టేషన్ కు మళ్లించారు.

మళ్ళీ యధావిధిగా ఈ తేదీ నుండే
అలాగే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి సాయంత్రం 4 గంటలకు బయలుదేరే శాతవాహన ఎక్స్ ప్రెస్ రైలును కూడా కాచిగూడ నుంచి బయలుదేరేలా మార్పు చేశారు. మళ్లీ వచ్చే నెల 7వ తేదీ నుండి విజయవాడ - సికింద్రాబాద్ మధ్య శాతవాహన ఎక్స్ప్రెస్ రాకపోకలు కొనసాగించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+