అర్ద్రరాత్రి కీలక నిర్ణయం- ఐఆర్ రికవరీ ఉండదు : అయిదేళ్లకే పీఆర్సీ: నేడు సీఎంతో చర్చలు..!!

ఏపీలో ఇప్పుడు ఉద్యోగుల సమ్మె వ్యవహారం టెన్షన్ పెడుతోంది. నేరుగా ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాలతో చర్చలకు దిశా నిర్దేశం చేసారు. అర్ద్రరాత్రి వరకు చర్చలు జరిగాయి. మంత్రుల కమిటీ నుంచి ఉద్యోగు లు ఆందోళన వ్యక్తం చేస్తున్న కొన్ని కీలక అంశాల్లో నిర్దిష్ట హామీలు దక్కాయి. ఇక, మరి కొన్ని ముఖ్యమైన అంశాలపైన నేటి సమావేశంలో క్లారిటీ రానుంది. ఈ సాయంత్రం అవసరమైతే ఉద్యోగ సంఘాలు సీఎం జగన్ తో భేటీ కానున్నాయి. రెండు వైపుల సానుకూల ప్రకటన వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే, అన్ని అంశాల్లోనూ సానుకూలత వచ్చే వరకూ తమ ఉద్యమ కార్యాచరణ కొనసాగు తుందని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.

ప్రభుత్వం - ఉద్యోగుల చర్చల్లో సానుకూలత

ప్రభుత్వం - ఉద్యోగుల చర్చల్లో సానుకూలత

శుక్రవారం సాయంత్ర ఉద్యోగ సంఘాలతో చర్చలు చేస్తున్న మంత్రుల కమిటీతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఉద్యోగుల డిమాండ్ల పైన చర్చించారు. మంత్రులకు దిశా నిర్దేశం చేసారు. ఉద్యోగులు సమ్మెకు దిగటం.. ప్రభుత్వం చర్యలు తీసుకోవటం వరకూ పరిస్థితి రాకుండా.. చర్చల ద్వారా పరిష్కారం చూడాలని సూచించారు.

ఆ వెంటనే మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం అయింది. అర్ద్రరాత్రి ఒంటి గంట వరకు చర్చలు జరిగాయి. అందులో ప్రధానంగా ...ప్రభుత్వం జీవో జారి చేసిన విధంగా కేంద్ర పీఆర్సీ విధానం కాకుండా... అయిదేళ్లకు ఒకసారి పీఆర్సీ అమలు అయ్యేలా మంత్రుల నుంచి హామీ వచ్చిందని చెబుున్నారు. దీంతో పాటుగా కీలక మైన ఐఆర్ రికవరీ అంశంపై ఆందోళనకు తెర దించేలా, అసలు రికవరీ ఉండదంటూ మంత్రులు హామీ ఇచ్చారని సమాచారం.

అర్ద్రరాత్రి వరకు సాగిన చర్చలు

అర్ద్రరాత్రి వరకు సాగిన చర్చలు

దీంతో..చర్చలు మరింత ముందుకు సాగాయి. అందులో హెచ్ఆర్ఏ అంశం పైన సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వం తాజా పీఆర్సీ అమల్లో భాగంగా జీవోలో పేర్కొన్న వాటిని సరిదిద్దేందుకు హామీ లభించింది. 2 లక్షల జనాభాలోపు ఉన్న ప్రాంతాల్లో ఉద్యోగుల‌కు 8 శాతం హెచ్‌ఆర్‌ఏ ప్ర‌తిపాద‌న పెట్ట‌గా.. అదే 2 ల‌క్ష‌ల నుంచి 5 లక్షల జనాభా ఉంటే 12 శాతం హెచ్‌ఆర్‌ఏ, ఇక‌, 5-15 లక్షల జనాభా ఉన్న న‌గ‌రాల్లో 16 శాతం హెచ్‌ఆర్‌ఏ ప్రతిపాదించింది.

15 లక్షలకు పైగా జ‌నాభా ఉండే న‌గ‌రాల్లో 24 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇస్తామని హమీ లభించిందని తెలుస్తోంది. అదే విధంగా..అడిష‌న‌ల్ క్వాంట‌మ్ ఆఫ్ పెన్ష‌న్ విధానంలోనూ కీల‌క ముంద‌డుగు ప‌డిన‌ట్టుగా తెలుస్తోంది.. 70 ఏళ్లు పైబ‌డిన పెన్ష‌న‌ర్ల‌కు 5 శాతం అద‌న‌పు పెన్ష‌న్ స‌దుపాయం.. 75 ఏళ్లు పైబ‌డిన పెన్ష‌న‌ర్ల‌కు 10 శాతం అద‌న‌పు పెన్ష‌న్ స‌దుపాయం, 80 ఏళ్లు పైబ‌డిన పెన్ష‌న‌ర్ల‌కు 20 శాతం అద‌న‌పు పెన్ష‌న్ స‌దుపాయం క‌ల్పించ‌నున్న‌ట్టు ప్ర‌తిపాద‌న‌లు వచ్చాయి.

కీలక అంశాలపై ప్రభుత్వం నుంచి హామీ

కీలక అంశాలపై ప్రభుత్వం నుంచి హామీ

ఈ అంశాల పైన ఆర్దిక శాఖ అధికారులతో ఈ ఉదయం మంత్రుల కమిటీ భేటీ కానుంది. ఈ డిమాండ్లు అంగీకరించటం ద్వారా ఏ మేర ఆర్దికంగా భారం పడుతుందనే అంశం పైన చర్చించనున్నారు. ఆ తరువాత ఈ రోజు మధ్నాహ్నం 2 గంటలకు మరోసారి మంత్రుల కమిటీ - ఉద్యోగ సంఘాల మధ్య చర్చలు సాగనున్నాయి. అందులో పూర్తిగా సమస్య పరిష్కారం అవుతాయనే ఆశాభావం వ్యక్తం అవుతోంది.

అయితే, ఫిట్ మెంట్... హెచ్ఆర్ఏ.. సీసీఏ రద్దు వంటి అంశాల పైన ఈ రోజు జరిగే చర్చల్లో ప్రభుత్వం నుంచి హామీ వస్తే..ఉద్యోగుల అందోళన చేస్తున్న అంశాల్లో కీలకమైనవి పరిష్కరించినట్లుగా భావించవచ్చు. ఆ తరువాత ఉద్యోగ సంఘాలు వీటి పైన సీఎం జగన్ తోనూ సమావేశం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రితో చర్చల తరువాత సమ్మె పైన కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

నేడు మరోసారి భేటీ.. ఆ తరువాత సీఎం వద్ద

నేడు మరోసారి భేటీ.. ఆ తరువాత సీఎం వద్ద

అయితే, అంతకు ముందుగా ఉద్యోగ సంఘాల డిమాండ్ల పైన ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నట్లుగా సానుకూల నిర్ణయాలు రావాల్సి ఉంటుందని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెబుున్నారు. ఉద్యోగుల్లో ఏర్పడిన అసంతృప్తిని సరిదిద్దే ప్రయత్నం చేశామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా శనివారం సాయంత్రం లోపు తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి బొత్సా వ్యాఖ్యానించారు. మంత్రుల కమిటీతో మంచి వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయి కాబట్టి అవి సఫలమవుతాయనే విశ్వాసం ఉందని పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాస రావు చెప్పారు.

Recommended Video

    AP PRC: Chalo Vijayawada ఆత్మరక్షణలో AP Govt సమ్మెను అడ్డుకునేదెలా? | Andhra Pradesh| OneindiaTelugu
    అన్నీ అనుకూలిస్తే.. సమ్మెపై కీలక ప్రకటన

    అన్నీ అనుకూలిస్తే.. సమ్మెపై కీలక ప్రకటన

    పూర్తి స్థాయిలో చర్చలు జరిగి, ఫలితం వచ్చే వరకు పెన్‌ డౌన్, సహాయ నిరాకరణ యధావిధిగా కొనసాగుతుందని ఉద్యోగ సంఘ నేత సూర్యనారాయణ చెప్పారు. ఉద్యోగుల ఆకాంక్షలను ప్రభుత్వం గుర్తించిందని... కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని... మరికొన్నింటిపై ఏకాభిప్రాయం రావాల్సి ఉందని..ఉద్యోగ సంఘాల నేతలు వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. అన్ని విషయాలపై ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత తుది నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేసారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+