ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. నాలుగు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పట్టణాల్లోని ప్రభుత్వ భూముల్లో పేదల ఇళ్ల క్రమబద్ధీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపిం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. నాలుగు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పట్టణాల్లోని ప్రభుత్వ భూముల్లో పేదల ఇళ్ల క్రమబద్ధీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

100 చదరపు గజాల లోపు స్థలాలను ఉచితంగా క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. ఆపై స్థలాలకు నిర్దేశిత ఫీజులు వసూలు చేస్తారు. అయితే, ఈ భూములను 2013 వాల్యూ ప్రకారం క్రమబద్ధీకరించనున్నారు.

chandrababu-naidu

అలాగే సోలార్‌ విధానంలో మార్పులు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. పత్తికి బదులు ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహకాలకు ఆమోదం తెలిపినట్లు సమాచారం.
ప్రత్యామ్నాయ పంటలు వేసే రైతులకు రూ.53.5 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.

బైరైటీస్‌ నూతన సమగ్ర విక్రయ విధానాన్ని ఆమోదిస్తూ కూడా సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే వెంకటాపురంలో 98.37 ఎకరాలను ఏపీఐఐసీకి బదలాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+