వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకేష్ పాదయాత్రలో అవే కీలకం ? పాదయాత్ర భవిష్యత్తు తేల్చే ఛాన్స్ ! వాటిపైనే అభ్యంతరాలు ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో టీడీపీ యువనేత నారా లోకేష్ ఈ నెల 27 నుంచి కుప్పం నుంచి యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో యువతను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు ఆ పేరు చూస్తేనే అర్ధమవుతుంది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్ధితుల్లో యువతను లక్ష్యంగా చేసుకున్న రాజకీయాలు చేస్తేనే నెగ్గుకు రాగలమని లోకేష్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పాదయాత్రలో లోకేష్ ఎంచుకున్న వ్యూహాలు ఇప్పుడు ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయా ? పాదయాత్రకు అనుమతి విషయంలో డీజీపీ ఎందుకు అభ్యంతరాలు చెబుతున్నారు ? వీటి వెనుక ఏముందనే చర్చ ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతోంది.

లోకేష్ పాదయాత్ర అనుమతి

లోకేష్ పాదయాత్ర అనుమతి


టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ఈ నెల 27 నుంచి యువగళం పేరుతో పాదయాత్ర చేపడుతున్నారు. ఇందుకోసం అనుమతి ఇవ్వాలంటూ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు స్ధానిక ఎస్పీలు, హోంశాఖ కార్యదర్శికి కూడా పార్టీ తరఫున లేఖలు రాశారు. అయితే వీటికి ఇప్పటివరకూ స్పందన రాలేదు. పాదయాత్రకు మరో మూడు రోజుల సమయం మాత్రమే మిగిలుంది. ఇంత తక్కువ సమయంలో పాదయాత్ర నిర్వహణకు ఏర్పాట్లు చేసుకోవడం కష్టంగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అటు డీజీపీ మాత్రం అభ్యంతరాలు లేవనెత్తుతున్నారు.

డీజీపీ అభ్యంతరాలు

డీజీపీ అభ్యంతరాలు

నారా లోకేష్ చేపట్టే యువగళం పాదయాత్రకు టీడీపీ చాలా ముందుగానే దరఖాస్తు చేసుకున్నా.. పోలీసులు మాత్రం ఇప్పటివరకూ స్పందించకుండా మౌనంగా ఉండిపోయారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం నిర్ణయం తీసుకుందామని భావించారు. అయితే ఇప్పుడు లోకేష్ పాదయాత్రకు సమయం దగ్గరపడుతుండటంతో పోలీసులపై టీడీపీ నుంచి ఒత్తిడి పెరుగుతోంది. దీంతో డీజీపీ తాజాగా దీనిపై స్పందించారు. లోకేష్ పాదయాత్రలో ఎవరెవరికి కలవబోతున్నారనే అంశంపై క్లారిటీ కోరారు. అలాగే రూట్ మ్యాప్, కాన్వాయ్, ఇతర వాహనాల జాబితా ఇమ్మన్నారు. ఆ వివరాలు ఇస్తే పాదయాత్రపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అంతే కానీ అనుమతి ఇచ్చేస్తామని చెప్పలేదు. దీంతో టీడీపీ వర్గాలు డీజీపీ తీరుపై మండిపడుతున్నాయి.

లోకేష్ కలిసేది వీరినే ?

లోకేష్ కలిసేది వీరినే ?

లోకేష్ పాదయాత్రలో పాల్గొనే వారి వివరాలు ఇమ్మంటూ డీజీపీ కోరడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. లోకేష్ యాత్రలో లక్షల మందిని కలిసే అవకాశం ఉంటుందని, ఇందులో ప్రభుత్వ బాధిత వర్గమే ఎక్కువగా ఉంటుందనే స్పష్టత మాత్రం ఇస్తున్నారు. దీంతో ప్రభుత్వ వ్యతిరేక వర్గాలతో తాను భేటీ కాబోతున్నట్లు లోకేష్ సంకేతాలు ఇస్తున్నట్లుంది. అంటే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను పెంచేందుకు ఈ పాదయాత్ర చేస్తున్నట్లు ఆయన చెప్పకనే చెప్పేశారు. దీంతో ప్రభుత్వం ఇప్పుడు దీనికి అనుమతి ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయించాల్సి ఉంది. అయితే అనుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా పాదయాత్ర చేసి తీరుతామని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి.

 క్లోజ్డ్ డోర్ మీటింగ్స్ తోనే ?

క్లోజ్డ్ డోర్ మీటింగ్స్ తోనే ?

అయితే పాదయాత్రలో లోకేష్ కలిసే వర్గాలపై ప్రభుత్వ అభ్యంతరాల వెనుక మరో కీలక కారణం ఉంది. అది పాదయాత్రలో లోకేష్ ఏర్పాటు చేసిన క్లోజ్డ్ డోర్ మీటింగ్స్. అంటే నాలుగు గోడల మధ్య నిర్వహించే సమావేశాలు. వీటిలో లోకేష్ ఎవరెవరిని పిలుస్తున్నారు, భేటీ కాబోతున్నారు, వారితో ఏం చర్చించబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ కారణంగానే లోకేష్ కలిసేవారి వివరాలు ఇవ్వాలంటూ డీజీపీ కోరుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా రోడ్లపై జరిగే పాదయాత్రలో అందరినీ కలిసే అవకాశం ఉండదు. కొందరిని రహస్యంగానే కలవాల్సి ఉంటుంది. గతంలో జరిగిన వైఎస్, చంద్రబాబు, జగన్ పాదయాత్రల్లోనూ జరిగేది ఇదే. అయితే ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్ధితుల్లో లోకేష్ పాదయాత్రలో ఇలాంటి ప్రత్యేక వర్గాలతో జరిగే భేటీలు మొత్తం పాదయాత్ర స్వరూపాన్నే మార్చే అవకాశాలుంటాయి. దీంతో ప్రభుత్వం ఇప్పుడు వాటిపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది.

English summary
key reason behind jagan regime's worry on nara lokesh's yuvagalam padayatra ?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X