వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ధీమా అదేనా ? క్లీన్ స్వీప్ చెయ్యటం సాధ్యమేనా ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని వై సీపీ ధీమాలో ఉంది. అందుకోసం ప్రతిపక్ష పార్టీలను దెబ్బ కొట్టే వ్యూహాలే కాదు, ప్రజా క్షేత్రంలో ప్రజల మద్దతు కూడగట్టే వ్యూహాలను కూడా సిద్ధం చేసింది . కేవలం గెలుపు మాత్రమే కాదు.. బంఫర్ మెజారిటీ సాధించాలని , అది కూడా సార్వత్రిక ఎన్నికల కంటే గొప్పగా ఉండాలని భావిస్తున్న వైసీపీ ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కకూడదని కసరత్తులు చేస్తుంది . ఇంతకీ వైసీపీ బలం ఏంటి ? క్లీన్ స్వీప్ చేసేలా ప్రజలు వైసీపీని ఆదరిస్తారని ఎలా అనుకుంటుంది ?

లోకల్ వార్ కు అన్ని అస్త్రాలు ప్రయోగిస్తున్న వైసీపీ

లోకల్ వార్ కు అన్ని అస్త్రాలు ప్రయోగిస్తున్న వైసీపీ

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ టార్గెట్ గత సార్వత్రిక ఎన్నికలను మించిన ప్రభంజనంతో ప్రతిపక్షాల అడ్రెస్ గల్లంతు చెయ్యటం . డిపాజిట్లు కూడా రాకుండా చెయ్యటం. ఈ ఎన్నికల ద్వారా ప్రతిపక్ష పార్టీల నోటికి తాళాలు వెయ్యటం . ప్రజల మద్దతు తమకే ఉందని నిరూపించటం .. ఇక దీనికోసం బాగానే కష్టపడుతుంది అధికార వైసీపీ .
లోకల్‌వార్‌కు అన్ని రకాలుగా అధికార వైసీపీ సిద్ధమైంది.

క్షేత్ర స్థాయిలో మంత్రుల నుంచి సామాన్య కార్యకర్త వరకూ

క్షేత్ర స్థాయిలో మంత్రుల నుంచి సామాన్య కార్యకర్త వరకూ

ఈ ఎన్నికల్లో బంఫర్ మెజారిటీ సాధించాలని టార్గెట్ పెట్టుకున్న వైసీపీ అందుకు కావల్సిన అన్ని అస్త్రాలను ప్రయోగిస్తుంది . ఇక ఈ ఎన్నికల్లో ప్రలోభాలకు చెక్ పెట్టేలా నిఘా యాప్ ను కూడా ప్రారంభించింది వైసీపీ సర్కార్ . మంత్రుల నుంచి సామాన్య కార్యకర్త వరకూ ఎన్నికల క్షేత్రంలో వ్యూహాత్మకంగా అధినేత ఆదేశాల మేరకు ముందుకు వెళ్తున్నారు.ప్రతిపక్ష పార్టీల ఎత్తుగడలకు చెక్ పెట్టేలా ముందే ప్రతిపక్ష పార్టీల నేతలకు గాలం వేస్తూ వలసలను ప్రోత్సహిస్తుంది . ముఖ్యంగా టీడీపీ ముఖ్య నాయకులను , మాజీ మంత్రులను వైసీపీలో చేర్చుకుని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊపిరాడకుండా చేస్తుంది .

ముఖ్యనేతలకు సీఎం జగన్ టార్గెట్లు ... వ్యూహాలు

ముఖ్యనేతలకు సీఎం జగన్ టార్గెట్లు ... వ్యూహాలు

ఇక అంతే కాదు వైసీపీ అధినేత జగన్ ఈ విషయంలో పార్టీ మంత్రులకు, ముఖ్య నేతలకు, ఎమ్మెల్యేలకు టార్గెట్లు పెట్టారు. మంత్రులకైతే ఏకంగా పదవులకే ఎసరు పెట్టారు. ప్రతిఒక్కరు గెలుపు కోసం పని చెయ్యాలని సూచించారు . అంతే కాకుండా పార్టీలోని కీలక నేతలకు ప్రాంతాల వారీగా బాధ్యతలు అప్పగించారు జగన్. విశాఖతో పాటు ఉత్తరాంధ్ర బాధ్యతలు విజయసాయిరెడ్డికి, ఉభయగోదావరి జిల్లాల బాధ్యతలు వైవీ సుబ్బారెడ్డికి, రాయలసీమ బాధ్యతలు సజ్జల రామకృష్టారెడ్డికి అప్పగించారు.

Recommended Video

AP Local Body Elections: Janasena Bjp Manifesto బీజేపీ-జనసేన సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్టేనా ?
సంక్షేమ పథకాలు ఓటు బ్యాంకు తెచ్చిపెడుతుందన్న నమ్మకంలో వైసీపీ

సంక్షేమ పథకాలు ఓటు బ్యాంకు తెచ్చిపెడుతుందన్న నమ్మకంలో వైసీపీ

ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపైనే వైసీపీ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. గత 9 నెలల నుండి అమలు అవుతున్న పథకాలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అన్ని వర్గాలకు ఆర్ధిక చేయూత నిచ్చేలా దాదాపు 80 శాతం మ్యానిఫెస్టో అమలు చెయ్యడంతో పాటు, ఎన్నికల్లో ఇవ్వని హామీలను కూడా అమలు చేశామని భావిస్తున్న వైసీపీ తాము అందించిన సంక్షేమ పథకాలే తమకు లాభం చేకూరుస్తాయని ఎన్నికల్లో విజయం అందిస్తాయని భావిస్తున్నారు. చూడాలి సీఎం జగన్ సంక్షేమ మంత్రం ఎన్నికల్లో ఎలాంటి ఫలితం ఇస్తుందో!!

English summary
The YCP has hoped for welfare schemes that have been in place since the YCP came to power in local bodies elections. Schemes that have been running for the past 9 months have been heavily promoted. With nearly 80 per cent of the manifesto being implemented to provide financial support to all communities, the YCP is expected to benefit from the welfare schemes provided by the YCP, which is expected to implement non-election guarantees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X