నేను చచ్చిపోతా.. టీడీపీ ఎమ్మెల్యే శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు !
ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవి కుమార్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. సదరు ఎమ్మెల్యేపై లోలుగు కేజీవీబీ ప్రిన్సిపల్ సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ప్రిన్సిపల్ సౌమ్య ఆరోపించారు. ఎమ్మెల్యే అనుచరులు సైతం నానా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.
ఎమ్మెల్యే వేధింపులు తట్టుకోలేకపోతున్నానని.. నా వల్ల కావడం లేదని ఎమోషనల్ అయ్యారు. ఉన్నతాధికారులు సైతం ఎమ్మెల్యే చెప్పిందే వింటున్నారని అసహనం వ్యక్తం చేశారు. సమాజంలో గౌరవంగా బతుకుతున్నానని.. ఇలా ఎందుకు చేస్తున్నారని వాపోయారు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

నైట్ టైమ్ వీడియో కాల్..
నాకు చచ్చిపోవాలని ఉంది.. నేను ఆత్మహత్య చేసుకుంటా..అని ప్రిన్సిపల్ సౌమ్య బోరున విలపించారు. అడ్మిషన్ల కోసం మీటింగ్ అని చెప్పి రాత్రి 11 గంటలకు ఫోన్ చేస్తున్నారని ప్రిన్సిపల్ వాపోయారు. ఇందుకు సంబంధించిన నైట్ టైమ్ వీడియో కాల్ స్క్రీన్ షాట్లు సైతం బయటపెట్టడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎమ్మెల్యే మాట వినలేదనే తనను.. వేరే ప్రాంతానికి ట్రాన్స ఫర్ చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే పై ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
ఇక వ్యవహారంపై సోషల్ మీడియాలో వైసీపీ సంచలన పోస్టులు పెడుతోంది. మహిళా ఉద్యోగులు లొంగకుంటే బెదిరిస్తూ.. ఎమ్మెల్యే కూన రవి కుమార్ శాడిజం చూపుతున్నారని వైసీపీ ట్వీట్ చేసింది. సదరు ఎమ్మెల్యేపై వైసీపీ నేతలు సైతం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మరి సీఎం చంద్రబాబు ఈ విషయంపై ఎలా రియాక్ట్ అవుతారని తెలియాల్సి ఉంది.
🚨 #CBNKamaParty
— YSR Congress Party (@YSRCParty) August 16, 2025
ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కు రాత్రయితే ఒంటి మీద తెలివి ఉండదు.. మహిళా ఉద్యోగులకు ఫోన్లు చేసి పిచ్చెక్కి మాట్లాడుతుంటారు. కేజీబీవీ ప్రిన్సిపల్ కు కూడా ఆయన వేధింపులు తప్పడం లేదు.. మహిళా ఉద్యోగులు తనకు లొంగకుంటే బదిలీ చేయిస్తానని బెదిరించి ఎమ్మెల్యే తన… pic.twitter.com/euw2M4z23g












Click it and Unblock the Notifications