గుంటూరు బాలిక కిడ్నాప్: కాశ్మీర్ తీసుకెళ్లిన ఆటో డ్రైవర్, పట్టేసిన పోలీసులు
గుంటూరు జిల్లాలోని భట్టిప్రోలులో ఇటీవల లిఖిత (13) అనే బాలిక అదృశ్యమైంది. తమ కూతురి ఆచూకీ తెలియకపోవడంతో కంగారు పడిన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గుంటూరు: జిల్లాలోని భట్టిప్రోలులో ఏప్రిల్ 21న కిడ్నాపైన లిఖిత (13) అనే బాలిక కేసులో పోలీసులు పురోగతి సాధించారు. తమ కూతురి ఆచూకీ తెలియకపోవడంతో కంగారు పడిన లిఖిత తల్లిదండ్రులు గత నెలలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ కేసులో దర్యాప్తు కొనసాగించిన పోలీసులు పురోగతి సాధించారు. లిఖిత జమ్మూకాశ్మీర్‌లోని సాంబాలో ఉందని గుర్తించిన పోలీసులు.. ఆ బాలికను ఓ ఆటోడ్రైవర్ అపహరించి తీసుకెళ్లినట్లు తేల్చారు.

జమ్మూకాశ్మీర్‌కు వెళ్లిన గుంటూరు పోలీసులు ఆటోడ్రైవర్ నాగేశ్వరరావుని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద లిఖిత ఉన్నట్లు సమాచారం. కాగా, తమ కూతురి ఆచూకీ లభించడంతో ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది












Click it and Unblock the Notifications