కదిరిలో సంచలనం:పోలీసు యూనిఫారంతో వచ్చి కిడ్నాప్

కదిరి :అనంతపురం జిల్లా కదిరి లో చోటుచేసుకొన్న కిడ్నాప్ ఘటన సినిమాను తలపించింది. ఈ ఘటనపై కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. పోలీసుల యూనిఫారంలో వచ్చి కిడ్నాపర్లు కిడ్నాప్ కు పాల్పడడం సంచలనం కల్గించింది.

కదిరి పట్టణానికి చెందిన ప్రేమనాథ్ రెడ్డిని నలుగురు వ్యక్తులు బుదవారం తెల్లవారుజామున కిడ్నాప్ చేశారు.బైక్ లపై పోలీస్ యూనిఫారంలో వచ్చిన కిడ్నాపర్లు ఈ ఘటనకు పాల్పడ్డారని కుటుంబసభ్యులు చెప్పారు.

kidnappers dress up like a police

కడప జిల్లాకు చెందిన రాణా ప్రతాప్ రెడ్డే ఈ కిడ్నాప్ కు పాల్పడినట్టు ప్రేమనాథ్ రెడ్డి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.ప్రేమనాథ్ రెడ్డి, ప్రతాప్ రెడ్డిలు మిత్రులు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతాప్ రెడ్డికి ప్రేమ్ నాధ్ రెడ్డి రూ.3.5 లక్షలు అప్పుగా ఇచ్చాడు. ఈ డబ్బులను చెల్లించకుండా ఇబ్బందిపెడుతున్నాడు.

డబ్బులు చెల్లించకపోవడంతో ప్రతాప్ రెడ్డికి ప్రేమ్ నాథ్ రెడ్డి నోటీసులు పంపాడు. తనకే నోటీసులు పంపుతావా అంటూ ప్రతాప్ రెడ్డి గతంలో బెదిరించారని ప్రేమనాథ్ రెడ్డి కుటుంబసబ్యులు ఆరోపించారు.పోలీసు యూనిపారంలో వచ్చి కిడ్నాప్ కు పాల్పడింది ప్రతాప్ రెడ్డి మనుషులేనని ప్రేమనాథ్ రెడ్డి సతీమణి లక్ష్మి ఆరోపించారు..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+