వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుకే అస్త్రం: కిడ్నీ రాకెట్ ముఠా పట్టివేత (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్ పోలీసులు కిడ్నా రాకెట్ ముఠాను పట్టుకున్నారు. ఫేస్‌బుక్‌లో విస్తృతంగా ప్రచారం చేసి, దేశవ్యాప్తంగా కిడ్నీ రాకెట్లు గుట్టుగా చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నాయని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ చెప్పారు. ఇలాంటి కిడ్నీ రాకెట్ ముఠాల్లో ఒక్క ముఠాను మాత్రమే తాము పట్టుకోగలిగామని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.

తాము ముఠాలోని ముగ్గురిని అరెస్టు చేశామని, మరొకరి కోసం గాలిస్తున్నామని ఆయన చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన దినేష్ కొలంబోలో చనిపోవడంతో, కుటుంబ సభ్యులు ఫిర్యాదు కారణంగా కేసు నమోదు చేశామని, దాంతో నమ్మశక్యం కాని విషయాలు వెలుగు చూశాయని ఆయన అన్నారు.

పూణే, అహ్మదాబాద్, ముంబై, కురుక్షేత్ర, భువనేశ్వర్ నగరాల్లో కిడ్నీ రాకెట్లు సాగుతున్నట్లు తేలిందని ఆయన చెప్పారు. తాము పట్టుకున్న ముఠా 21 మందిని కొలంబో తీసుకుని వెళ్లి మూత్రపిండాలు తీయించి లక్షల్లో డబ్బులిచ్చి పంపినట్లు తేలిందని ఆయన చెప్పారు.

{photo-feature}

English summary

 Hyderabad police arrested three members of kidney rocket gang. Hyderabad police commissioner Anurag Sharma explained the operation of kidney rocket.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X