చంద్రబాబుకు బిగ్ షాక్.. టీడీపీకి కీలక నేత గుడ్ బై..!

ఏపీలో కూటమి మధ్య టికెట్ల పంచాయితీ ఇంకా కొనసాగుతూనే ఉంది. శుక్రవారం చంద్రబాబు తుది జాబితాలో భాగంగా అభ్యర్థులను ప్రకటించారు. లిస్ట్‌తో తమ పేర్లు లేని అభ్యర్థులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగానే అనంతపురం జిల్లా సిటీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి టికెట్ దక్కకపోవడంతో ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పార్టీ ఆఫీసులో టీడీపీ,చంద్రబాబు ఫ్లెక్సీలకు నిప్పంటించారు.

తాజాగా మరో టీడీపీ కీలక నేత అయిన కిమిడి నాగార్జున పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. చీపురుపల్లి టికెట్ దక్కకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. విజయనగర జిల్లా అధ్యక్ష పదవితో పాటు, చీపురుపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు కిమిడి నాగార్జున తెలిపారు. విజయనగర జిల్లా అధ్యక్షుడుగా ఉన్న తనకు చీపురుపల్లి టికెట్ వస్తుందని ఆయన ఆశలు పెట్టుకున్నారు.

kimidi nagarjuna resign from tdp

కానీ చంద్రబాబు తాజాగా విడుదల చేసిన టీడీపీ అభ్యర్థుల జాబితాలో చీపురుపల్లి టికెట్ కళా వెంకట్రావు పేరును ఖారారు చేశారు. తనకు కాకుండా పెదనాన్న కళా వెంకట్రావుకు టికెట్ కేటాయించడంతో మనస్థాపం చెందిన కిమిడి నాగార్జున టీడీపీకి రాజీనామా చేశారు. తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన కిమిడి నాగార్జున.. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు.

నాగార్జున తల్లి మృణాలిని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2014లో పోటీచేసి బొత్స చేతిలో ఓటమి పాలైన నాగార్జున అప్పటి నుండి నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం పనిచేస్తూ వచ్చారు. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేశారు. తీరా ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి టికెట్ ఇవ్వకుండా మొండిచేయి చూపడంతో ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+