Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సింహం ఏడ్చింది - ఏడిపించింది: విరాట్ కోహ్లీ బరస్ట్ వెనుక..!!

దేశం మొత్తం ఇప్పుడు ఒకటే పేరు ట్రెండ్ అవుతోంది. దీపావళి నాడు ప్రతీ భారతీయుడు గర్వంగా చెబుతున్న పేరు విరాట్ కోహ్లీ. కోహ్లీ ఈజ్ కింగ్ అంటూ సోషల్ మీడియా హోరెత్తుతోంది. దేశంలోని ప్రముఖ నేతల నుంచి అన్ని రంగాల వారు కోహ్లీని ఆకాశినికెత్తేస్తున్నారు. ప్రపంచ కప్ లో చిరకాల ప్రత్యర్ధి పైన ఒంటి చేత్తో తన బ్యాటింగ్ విన్యాసాలతో మైమరిపించిన కోహ్లీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. స్టేడియంలో 90 వేల మంది.. దాదాపు 100 కోట్ల మంది భారతీయులను మరిచిపోలేని దీపావళి కానుక అందించిన విరాట్ కోహ్ల విజయం అందిన క్షణంలో కన్నీరు పెట్టారు. సింహం ఏడ్చింది. మ్యాచ్ గెలిచిన ఆనందంలో ఉన్న అభిమానులను ఏడిపించింది. కోహ్లీ కంట కన్నీరా అంటూ క్రికెట్ విశ్లేషకులు ఆశ్చర్యపోయారు.

కెప్టెన్ రోహిత్ స్టేడియంలోకి పరిగెత్తుకుంటూ వచ్చి మాజీ కెప్టెన్ కోహ్లీని ఎత్తుకొని తిప్పేసారు. సహచర టీం సభ్యుల ఆనందానికి హద్దులు లేవు. కానీ, ఆట గెలిచాన - ఓడినా క్రీడా స్పూర్తికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే కోహ్లీ ఎందుకు ఏడ్చాడు. మ్యాచ్ గెలుపుతో ఎమోషనల్ అయ్యాడా. ఆ ఒక్కటే కాదు. కొంత కాలంగా కోహ్లీ పైన ఎన్నో విమర్శలు. అసలు ఇక క్రికెట్ కు కోహ్లీ పనికిరాడంటూ ట్రోలింగ్ లు. కెరీర్ లో ఫాం లేకపోవటం ప్రతీ ఆటగాడికి ఎదురయ్యే పరిస్థితే. కానీ, కోహ్లీ ఆ పరిస్థితి సుదీర్ఘ కాలం ఎదుర్కొన్నాడు, చిరవకు కోహ్లీ ఫాం లో లేక విమర్శల పాలవ్వటం పైన కొందరు హద్దులు దాటారు. కోహ్లీ కూతురు ప్రస్తావన తీసుకొచ్చి ట్రోలింగ్ కు దిగారు. ఇక, వచ్చే ప్రపంచ కప్ వరకు కోహ్లీని భరించాల్సిందేనంటూ కామెంట్స్ గతంలో వచ్చాయి.

King Kohli turns emotional: gives answer to all the critics with one historical innings

కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా..టీం నుంచి తప్పుకోడా అంటూ ప్రశ్నలు వినిపించాయి. కానీ, అన్నింటనీ తట్టుకున్నాడు. సహచర టీం సభ్యులతో నిజమైన క్రీడాస్పూర్తితో వ్యవహరించాడు. జరిగేది ప్రపంచ కప్ అయినా, పాకిస్థాన్ తో గెలుపులో మాత్ర భారత్ క్రికెట్ అభిమానులకు ఉండే మజా వేరు. పాకిస్థాన్ తో తన బ్యాటింగ్ తో విజయం అందించాడు. అమావాస్య చీకట్లను తన షాట్స్ తో చీల్చేసాడు. దేశం మొత్తం కోహ్లీకి అప్పు ఉందా అనే విధంగా చప్పట్లతో.. ట్వీట్లతో మోత పుట్టించింది. ఒకే ఒక్క ఇన్నింగ్స్ కోహ్లీ ఏంటో రుజువు చేసింది. క్రీజులో మరో వైపు హార్డిక్ పాండ్యా నిలిచినా..అతనే తనకు సపోర్టు చేసాడని కోహ్లీ చెప్పటం మరో సారి తన సింప్లిసిటీని బయటపెట్టింది. 19వ ఓవర్ చివర్లో ఆ రెండు సిక్స్ లు కోహ్లీ షాట్స్ కావు.

కోట్లాది మంది భారతీయ క్రీడాభిమానుల కోసం మాత్రమే ఆడిన సిక్స్ లు. అవే మ్యాచ్ ను భారత్ వైపు తిప్పేసాయి. ఇక, మ్యాచ్ అయిపోయిన వెంటనే కోహ్లీ ఎమోషనల్ అయ్యాడు. తన కెరీర్ చీకట్లను చీల్చుతూ బరస్ట్ అయ్యాడు. తాను ఎందుకు అలా అవుతన్నదీ తన కుమార్తెకు అర్దం కాలేదని కోహ్లీ చెప్పుకొచ్చారు. కోహ్లీకి తెలియకుండానే కన్నీరు కార్చారు. ఒక వైపు కోట్లాది మంది ప్రశంసలతో..సంతోషంలో మునిగిపోయిన సమయంలోనూ..కోహ్లీ కంట కన్నీరు చూడగానే అభిమానులు లోలోపల ఏడ్చేసారు. కోహ్లీ ఈజ్ కింగ్ అంటూ.. ఒక్క ఇన్నింగ్స్ తో తన సత్తా ఏంటో.. చాటిన కోహ్లీకి జేజేలు పలికింది. చక్ దే టీం ఇండియా.. విరాట్ టేక్ ఏ అంటూ..యావత్ భారత్ ఒకే నినాదంతో సాహో కోహ్లీ అంటూ దీపావళి నాడు ప్రశంసలతో పట్టం కట్టింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+