విజయసాయి రెడ్డి-శాంతిల వ్యవహారంపై జగన్ సైలెన్స్ దేనికి?: కిరాక్ ఆర్పీ!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకున్న అనేక రాజకీయ పరిణామాల పైన జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వైసిపిని, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిని టార్గెట్ చేసిన కిరాక్ ఆర్పి వారి పైన సంచలన వ్యాఖ్యలు చేశారు.
సాయిరెడ్డికి కిరాక్ ఆర్పీ సవాల్
విజయసాయి రెడ్డి, శాంతిల విషయంలో చోటు చేసుకున్న వివాదాలకు సాయిరెడ్డి మీడియాను తిట్టడం, నోటికి వచ్చినట్టు దూషించడం, లేదంటే దేవుళ్ళ మీద ఒట్టు వేయడం తో నిజాయితీ బయటపడదని కిరాక్ ఆర్పి పేర్కొన్నారు. దమ్ముంటే విజయ సాయి రెడ్డి డిఎన్ఏ టెస్ట్ చేయించుకుని తన నిజాయితీని నిరూపించుకోవాలంటూ సవాల్ విసిరారు. విజయ సాయి రెడ్డి తక్షణం మీడియాకు క్షమాపణలు చెప్పాలని, నెల్లూరు తాను మీడియాకు క్షమాపణలు చెబుతున్నానంటూ పేర్కొన్నారు.

సాయిరెడ్డి దుర్మార్గుడు
దుర్మార్గుడు విజయ సాయి రెడ్డి పుట్టింది నెల్లూరు జిల్లాలోనే అని, మీడియా పైన విజయసాయిరెడ్డి చేసే వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండించాలని లేదంటే మీడియానే చులకన అయ్యే అవకాశం ఉందని కిరాక్ ఆర్పి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం నెల్లూరువాసి పొట్టి శ్రీరాములు పోరాటం చేశాడని, పుచ్చలపల్లి సుందరయ్య, దూపకుంట రోశమ్మ వంటి పోరాటయోధులు నెల్లూరు వారేనని పేర్కొన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దేవుడు లాంటి మనిషి అంటూ వ్యాఖ్యలు చేశారు.
జగన్ సాయిరెడ్డి వ్యవహారంపై ఎందుకు మాట్లాడటం లేదు
ఈ క్రమంలోనే విజయ సాయి రెడ్డి పై మండిపడిన కిరాక్ ఆర్పి సాయి రెడ్డి డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటే అసలు విషయం బయట పడుతుందని పేర్కొన్నారు. ఇక వైయస్ జగన్ పై నిప్పులు చెరిగిన కిరాక్ ఆర్పి జగన్ మానసిక స్థితిపైన ఎర్రగడ్డలో పరీక్ష చేయించాలని వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రెడ్డి వ్యవహారంలో జగన్ ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు. శాంతికి కోటి 60లక్షలు విజయసాయిరెడ్డి ఎందుకు ఇచ్చాడో చెప్పాలన్నారు.
జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలి
వినుకొండ పరామర్శకు పోయి జగన్ అమ్మఒడి గురించి మాట్లాడాడు.. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియని అజ్ఞాని జగన్ అంటూ కిరాక్ ఆర్మీ నిప్పులు చెరిగారు. జగన్ కు ప్రతిపక్ష హోదా కావాలంటే దానికి తగ్గట్టుగా సీట్లు రావాలని, సీట్లు లేకపోవడం వల్లే ప్రతిపక్ష హోదా రాలేదన్నారు. జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు.
రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసే ప్లాన్ లో జగన్
రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలని జగన్ ఆలోచిస్తున్నారని, అందుకే అతని నోటి నుంచి మధ్యంతర ఎన్నికలు, రాష్ట్రపతి పాలన అనే పదాలు వినిపిస్తున్నాయని విమర్శించారు. ఇక వినుకొండ ఘటనలో రషీద్, జిలాని ఇద్దరు వైసీపీ కార్యకర్తలేనని జగన్ శవ రాజకీయాలు మానుకుంటే మంచిదని హితవు పలికారు.












Click it and Unblock the Notifications