బలపడుతున్న కిరణ్, నేతల తాకిడి: చిరుపై గెల్చిన ఉషా

శనివారం కిరణ్‌తో మాజీ మంత్రులు శత్రుచర్ల విజయరామ రాజు, పితాని సత్యనారాయణ, మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్, సీనియర్ నేత తులసి రెడ్డి, ఆనం సోదరుడు జయకుమార్, కేంద్రమంత్రి పనబాక లక్ష్మీ భర్త పనబాక కృష్ణయ్య తదితరులు భేటీ అయ్యారు. 2009లో నాటి ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి పైన విజయం సాధించిన బంగారు ఉషారాణి మాజీ ముఖ్యమంత్రితో నడిచేందుకు సిద్ధమయ్యారు.
పార్టీ ఏర్పాటు విషయంలో ఇప్పటికే ఆలస్యమైనందున వెంటనే విధి విధానాలను, పేరును, గుర్తును ప్రకటించాలని కిరణ్ సన్నిహితులు కూడా ఒత్తిడి చేస్తున్నారు. 12వ తేదీన రాజమండ్రి సభలోనే పూర్తి వివరాలు ప్రకటించాలని భావిస్తున్నారు. ఇందుకోసం శనివారం కిరణ్ బిజీబిజీగా గడిపారు. సోమవారం నాటికి పార్టీకి సంబంధించి జెండా, అజెండాను సిద్ధం చేయాలని కిరణ్ నిర్ణయించారు.
కిరణ్‌తో విద్యార్థి ఐకాస నేతలు, మేధావులు, ఐటి నిపుణులు తదితరులు భేటీ అయ్యారు. ఎపిఐఐసి మాజీ చైర్మన్ శివ రామకృష్ణ కూడా కిరణ్‌తో సమావేశమయ్యారు. కిరణ్ స్థాపించే కొత్త పార్టీలో చేరేందుకు పలువురు నేతలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై సీమాంధ్రలో ప్రజలు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉండడంతో ఈ పార్టీ నేతలందరూ క్రమంగా కిరణ్ పార్టీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు.
కాగా, రాజమండ్రిలో ఈ నెల 12న భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఎంపీ హర్ష కుమార్ సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సహాయ సహకరాలు అందిస్తున్నారు. దీనికి లగడపాటి కూడా తగు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి కిరణ్ పార్టీలోకి వలసలు క్రమంగా పెరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications