ఆయన బాధపడ్తున్నారు: డిగ్గీపై కిరణ్ ఆసక్తికర వ్యాఖ్య

Kiran interesting comments on Digvijay
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, విభజనపై రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ కూడా బాధపడుతున్నారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారట. ఢిల్లీ పర్యటన అనంతరం హైదరాబాదు వచ్చిన కిరణ్‌ను పలువురు నేతలు కలిశారు.

ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విభజనపై దిగ్విజయ్ సింగ్ కూడా బాధపడుతున్నారని, అలాగే ప్రస్తుత పరిస్థితుల పైన ఆయన ఆవేదన చెందుతున్నారని చెప్పారు. ఇటీవల దిగ్విజయ్ మాట్లాడుతూ.. విభజన నిర్ణయం బాధాకరమేనని, మరోసారి తెలంగాణవాదులు పదేళ్ల తర్వాత పశ్చాత్తాప పడతారని డిగ్గీ అన్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

కాగా, కిరణ్‌ను కలిసిన వారిలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పితాని సత్యనారాయణ, వట్టి వసంత్ కుమార్, ప్రభుత్వ విప్, సంగారెడ్డి శాసన సభ్యుడు జయప్రకాశ్ రెడ్డి తదితరులు ఉన్నారు.

కాగా, కాంగ్రెసు పార్టీ నుండి సీమాంధ్ర పక్షాన మంత్రుల బృందం(జివోఎం) ముందుకు వట్టి వసంత్ కుమార్ వెళ్లనున్నారు. జివోఎంకు చెప్పే విషయమై ముఖ్యమంత్రి సలహాలు తీసుకన్నారని సమాచారం. అలాగే ఢిల్లీ వరకు తనకు తోడుగా రావాల్సిందిగా ఆనంను కోరారు. మరోవైపు తెలంగాణ ప్రాంతం నుండి దామోదర రాజనర్సింహ వెళ్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+