వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను చెప్పిందే, అవి చెప్పా.. అలాగే జరుగుతోంది: కిరణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర విభజన వల్ల ఎలాంటి పరిణామాలు, అనర్థాలు ఉంటాయో తాను ముందే చెప్పానని, ఇప్పుడు అవే జరుగుతున్నాయని మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర వ్యవస్థాపకులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం వ్యాఖ్యానించారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాలుగా విడిపోతే నష్టమని తాను ముందే చెప్పానని అభిప్రాయపడ్డారు. కావాలంటే ఎవరికి వారు పరిశీలించుకోవాలని సూచించారు. విద్యుత్ కష్టాలు ఉంటాయని, నీటి తగాదాలు వస్తాయని అసెంబ్లీలోను, బయట తాను చెప్పానని ఆయన గుర్తు చేశారు.

కిరణ్, శేఖర్

కిరణ్, శేఖర్

మంగళవారం తాజ్ కృష్ణ హోటల్‌లో ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్త రాసిన యాంటిస్ పేటింగ్ ఇండియా ద బెస్ట్ ఆఫ్ నేషనల్ ఇంట్రెస్ట్ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

కిరణ్, శేఖర్

కిరణ్, శేఖర్

తాజ్ కృష్ణ హోటల్‌లో ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్త రాసిన యాంటిస్ పేటింగ్ ఇండియా ద బెస్ట్ ఆఫ్ నేషనల్ ఇంట్రెస్ట్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శేఖర్‌తో మాట్లాడుతున్న కిరణ్.

కిరణ్, శేఖర్

కిరణ్, శేఖర్

మంగళవారం తాజ్ కృష్ణ హోటల్‌లో ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్త రాసిన యాంటిస్ పేటింగ్ ఇండియా ద బెస్ట్ ఆఫ్ నేషనల్ ఇంట్రెస్ట్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతున్న కిరణ్, శేఖర్ గుప్తా.

కిరణ్, శేఖర్

కిరణ్, శేఖర్

ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్త రాసిన యాంటిస్ పేటింగ్ ఇండియా ద బెస్ట్ ఆఫ్ నేషనల్ ఇంట్రెస్ట్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిరణ్, శేఖర్.

కిరణ్, శేఖర్

కిరణ్, శేఖర్

తాజ్ కృష్ణ హోటల్‌లో ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్త రాసిన యాంటిస్ పేటింగ్ ఇండియా ద బెస్ట్ ఆఫ్ నేషనల్ ఇంట్రెస్ట్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శేఖర్‌తో కిరణ్ కరచాలనం.

మంగళవారం తాజ్ కృష్ణ హోటల్‌లో ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్త రాసిన యాంటిస్ పేటింగ్ ఇండియా ద బెస్ట్ ఆఫ్ నేషనల్ ఇంట్రెస్ట్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. విభజన తర్వాత జరిగిన తర్వాత పరిణామాల పైన విలేకరులు ఆయనను ఈ పుస్తకావిష్కరణ అనంతరం ప్రశ్నించారు. దానిపై ఆయన స్పందించారు.

పుస్తకావిష్కర కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 67 ఏల్లు పూర్తయిన సందర్భంగా భారత ప్రజాస్వామ్యం పైన, చట్ట సభల తీరు పైన, న్యాయ వ్యవస్థ పైన, ప్రభుత్వ పని తీరు పైన, రాజకీయ వ్యవస్థ పైన ఒకసారి లోతైన సమీక్ష జరగాలని అభిప్రాయపడ్డారు. పార్లమెంటులో దీని పైన చర్చ చేపట్టి, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద యువతరానికి నమ్మకం కలిగించాలన్నారు.

కాగా, విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు, ప్రముఖ వ్యాపారవేత్త లగడపాటి రాజగోపాల్ మరోసారి తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాజకీయాల పైన స్పందించారు. తాను రాజకీయాలకు కొంతకాలంగా దూరంగా ఉన్నానని తెలిపారు.

అవసరమైనప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుతానని తెలిపారు. మరికొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని లగడపాటి స్పష్టం చేశారు. ఆదివారం కర్నాటక రాష్ట్రం పావగడలో కమ్మ బాలికల వసతి గృహం ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

విభజన అనంతరం రాజకీయాలకు దూరంగా ఉంటూవస్తున్నానన్నారు. గత ఆరు నెలలుగా రాజకీయాల గురించి ఎక్కడా మాట్లాడలేదన్నారు. ప్రస్తుతం మాట్లాడటానికి వీలు కాదన్నారు. అతి త్వరలో మాట్లాడే సమయం వస్తుందని, అప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుతానని చెప్పారు. కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందిస్తూ రాజకీయాలకు దూరమవుతున్నానా, దగ్గరవుతున్నానా అన్నది ఇప్పట్లో చెప్పలేనన్నారు.

English summary
Former Chief Minister Kiran Kumar Reddy appears after elections!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X