కలెక్షన్‌కింగ్ బిల్డప్: కిరణ్‌పై శ్రీకాంత్, అక్కడ జెసి కర్చీఫ్

చీము, నెత్తురుంటే తక్షణమే అసెంబ్లీని సమావేశపరచాలని డిమాండ్ చేశారు. సమైక్యవాదిగా చెప్పుకొనే కిరమ్ అసెంబ్లీని సమావేశపరిస్తే సమైక్య తీర్మానం చేసి కేంద్రానికి పంపే అవకాశముంటుందన్నారు. అలా చేయకుంటే ఉద్యమాలను నీరుగార్చిన సమ్యైద్రోహిగా కిరణ్ మిగిలిపోతారన్నారు.
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచనలు పాటిస్తూ రాష్ట్రాన్ని విభజించేందుకే మూడేళ్ల క్రితం పదవి తీసుకున్నారని ఆరోపించారు. ఉద్యోగులు జీతాల్ని, జీవితాల్ని పణంగా పెట్టి సమైక్య ఉద్యమం చేస్తుంటే బయటకు సమైక్య బిల్డప్ ఇస్తూ ఉద్యమంపై నీళ్లు జల్లారని విమర్శించారు. సోనియా కోవర్టులా వ్యవహరిస్తున్న కిరణ్‌ను ప్రజలు క్షమించబోరన్నారు.
ఆత్మగౌరవయాత్రకు ప్రజాస్పందన లేక పోవడంతో ఢిల్లీలో దీక్ష డ్రామాలాడిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమైక్యానికి అనుకూలంగా ఒక్కలేఖ ఇస్తే చాలన్నారు. విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ లాంటి జోకర్లు, జెసి దివాకర్ రెడ్డి లాంటి స్వార్థపరులు చెప్పే మాటలను ప్రజలు విశ్వసించరన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాశనమవడంతో దిక్కుతోచక జెసి టిడిపిలో చోటు కోసం కర్చీఫ్ వేశారన్నారు. సమైక్య శంఖారావం విజయవంతమవడంతో జగన్‌పై ఆధారాల్లేని ఆరోపణలతో బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఓ మూలకు పరిమితమైన పార్టీ అధ్యక్షుడు కావడంతో తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన ఆరోపణలు చేయలేదని, ఆయన మాపై చేస్తే వెనుకాడేది లేదన్నారు.












Click it and Unblock the Notifications