వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిగొచ్చిన కిరణ్: ఢిల్లీ ఇష్యూపై మహిళామంత్రులకు ఫోన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్/న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం విచారం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి, సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు నేతలు దీక్ష కోసం ఎపి భవన్ నుండి వెళ్తుండగా తెలంగాణ ప్రాంత మహిళా మంత్రులు, ఇతర నేతలు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని ఈడ్చుకెళ్లిన విషయం తెలిసిందే.

దీనిపై కిరణ్ విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంత మంత్రులు గీతా రెడ్డి, సునిత లక్ష్మా రెడ్డి, డికె అరుణ తదితరులకు కిరణ్ శుక్రవారం ఫోన్ చేశారు. ఫోన్ ద్వారా ఢిల్లీలో జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు.

కాగా, దేశ రాజధాని ఢిల్లీలో ముఖ్యమంత్రి దీక్ష కోసం వెళ్తుండగా అడ్డుకునే ప్రయత్నం చేసిన మహిళా తెలంగాణ మంత్రులను పోలీసులు ఈడ్చివేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అప్పుడే మంత్రులు గీతా రెడ్డి, డికె అరుణ, సునిత లక్ష్మా రెడ్డి నిప్పులు చెరిగారు. మహిళా మంత్రులం అని కూడా చూడకుండా తమను పోలీసులు ఈడ్చి వేస్తుంటే ముఖ్యమంత్రి రాక్షసానందం పొందుతున్నారని వారు ధ్వజమెత్తారు.

ముఖ్యమంత్రిది అహంకారపూరిత వైఖరి అని, నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. సిఎం తీర్మానంలో తాము భాగస్వామ్యులం కాదల్చుకోలేదన్నారు. మహిళా మంత్రులను కూడా ఈడ్చి వేస్తుంటే ఆనందం పొందుతున్నారా అని ప్రశ్నించారు. ఈ మౌన దీక్ష ఎందుకు చేస్తున్నారో కిరణ్ చెప్పడం లేదన్నారు. కిరణ్ దీక్ష చేస్తే తెలంగాణ ఆగిపోతుందని తాము భావించడం లేదని కానీ అది సరికాదని చెబుతున్నామన్నారు. కిరణ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

మహిళా మంత్రులైన తాము అడ్డుకుంటుంటే కిరణ్ బస్సు దిగి ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించే ప్రయత్నం ఎందుకు చేయలేదన్నారు. సీమాంధ్ర ప్రజల పైన ఇన్నాళ్లు లేని ప్రేమ ఇప్పుడు పుట్టుకు వచ్చిందా అన్నారు. ఆయన సీమాంధ్ర సిఎంగా వ్యహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కిరణ్ ఇక డ్రామాలు బందు చేయాలన్నారు. సీమాంధ్ర ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని హితవు పలికారు.

English summary

 AP Chief Minister Kiran Kumar Reddy expressed his regret about New Delhi issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X