హైదరాబాద్‌లో సిఎం కిరణ్ రెడ్డి హల్‌చల్ (ఫొటోలు)
హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో స్తబ్దుగా ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అకస్తాత్తుగా హైదరాబాద్‌లో సుడిగాలి పర్యటన చేశారు. హైదరాబాద్‌లో పలు పథకాలకు ఆయన శ్రీకారం చుట్టారు. పలువురు కేబినెట్ మంత్రులతో కలిసి ఆదివారం నాడు ఆయన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు సంస్థలు, రోడ్డు, ఫ్లైఓవర్లు, చెరువుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో నగర ప్రజల ఇక్కట్లను తీరుస్తామని కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ట్రాఫిక్ ఇక్కట్లను దశల వారీగా తొలగిస్తామన్నారు. మాధాపూర్ అయ్యప్పసొసైటీ సమీపంలోని ఖానామెట్ గ్రామంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్‌కు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార ్‌రెడ్డి ఆదివారం నాడు శంకుస్థాపన చేశారు.
దీని కోసం రూ. 145 కోట్లు ఖర్చు చేయడం జరుగుతుందని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ సంస్థ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 20 ఎకరాలు కేటాయించింది. ఈ సంస్థలో 2013-14లో 9 వేల మంది పట్టణాభివృద్ధి సంస్థల సిబ్బందికి, అధికారులకు, ప్రజాప్రతినిధులకు విపత్తుల నిర్వహణపై శిక్షణ ఇస్తామని చెప్పారు.

రహదారుల విస్తరణ
హుడా కాలనీలోని చందానగర్ నుండి హఫీజ్‌పేట్ ఫ్లైఓవర్‌కు రూ. 16.43 కోట్లతో రహదారుల విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. హైటెక్ సిటీకి అతి దగ్గర మార్గంగా ఉండే శేరిలింగంపల్లి-హఫీజ్‌పేట్ మధ్యన ప్రధాన లింకు రోడ్డు, చందానగర్ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్‌కు లింక్‌గా ఏర్పడుతుంది.

లింక్ రోడ్డుకు శ్రీకారం
రూ. 15 కోట్ల వ్యయంతో మియాపూర్ నుండి ఎల్లమ్మబండ వరకు లింకు రోడ్డు నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. తొమ్మిదో నెంబర్ జాతీయ రహదారికి సమాంతరంగా అభివృద్ధి చేస్తున్న ఈ లింకు రోడ్డు నిర్మాణం ద్వారా ట్రాఫిక్ నియంత్రణ సులభం అవుతుంది.

సర్వీస్ రోడ్డుకు శంకుస్థాపన
కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు నుండి హైటెక్‌సిటీకి రూ. 3.20 కోట్లతో నిర్మించనున్న సర్వీసు రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ముసాపేట్ లోని ట్రాఫిక్‌ను నియంత్రించడానికి ఈ సర్వీసు రోడ్డు దోహదపడుతుంది. రూ. 3 కోట్ల వ్యయంతో 40.5 ఎకరాల్లో ముళ్లకత్తువ చెరువు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

మళ్లింపు పథకం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చెరువును కాపాడడానికి మురుగు నీరును, ఇతర జలాలలను మళ్లించడానికి ప్రతిపాదించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, రాష్ట్ర మంత్రులు మహీధర్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, ముఖేష్‌గౌడ్, ప్రసాద్ కుమార్, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

రంగారెడ్డిలో రూ.183 కోట్ల పనులు
రంగా రెడ్డి జిల్లాలో రూ.183 కోట్ల వ్యయంతో తలపెట్టిన వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శంకుస్థాపనలు చేసశారు.

ముళ్లకత్తువ చెరువు
40.5 ఎకరాల్లో రూ.3 కోట్లతో చేపట్టే ముళ్లకత్తువ చెరువు అభివృద్ధి పనులకు ముిఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

కిరణ్ కుమార్ రెడ్డి కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, రాష్ట్ర మంత్రులు మహిధర్ రెడ్డి, శ్రీధర్ బాబు, ముఖేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications