వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమ్ముడింట్లో కిరణ్ కుమార్ రెడ్డి స్కెచ్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీని స్థాపించే విషయంలో సీరియస్‌గా మంతనాలు సాగిస్తున్నారు.

ఆదివారం ఎంపీలతో భేటీ అయిన చర్చించిన కిరణ్, సోమవారం పలువురు ఇతర నేతలతో చర్చిస్తున్నారు. రెండుమూడు రోజుల్లో పార్టీని కిరణ్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

కిరణ్ మాదాపూర్‌లోని తన సోదరుని నివాసంలో బహిష్కృత ఎంపీలతో సుదీర్ఘంగా జోరుగా మంతనాలు జరుపుతున్నారు. ఆదివారం జరిగిన భేటీలో సబ్బం హరి, హర్ష కుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్, సాయి ప్రతాప్, రాయపాటి సాంబశివరావు, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, లగడపాటి రాజగోపాల్, మంత్రులు డాక్టర్ శైలజానాథ్, పితాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

కిరణ్ 1

కిరణ్ 1

విభజనకు వ్యతిరేకంగా సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక అధ్వర్యంలో ఉద్యమించిన తరహాలోనే సీమాంధ్ర పరిరక్షణ కోసం వేదికను ఏర్పాటు చేయాలా? లేక కొత్త పార్టీని స్థాపించి రాబోయే ఎన్నికల బరిలోకి దిగాలా? అనే అంశంపై కిరణ్ వారి అభిప్రాయాలను తీసుకుంటున్నారు.

కిరణ్ 2

కిరణ్ 2

ఇప్పటికే చాలా ఆలస్యమైందని, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయవద్దని ఎంపీలు ఆయనకు సూచించారు. సోమ, మంగళవారాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుందామని కిరణ్ వారికి చెప్పినట్లు సమాచారం.

కిరణ్ 3

కిరణ్ 3

సీమాంధ్ర ప్రజలంతా మీరు పెట్టబోయే పార్టీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని వారు ఆయన చెప్పారు. తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబునాయుడు చెబుతూ వచ్చిన సమన్యాయం పట్ల సీమాంధ్ర ప్రజలు చిరాకుగా ఉన్నారని వారు తెలిపారు.

కిరణ్ 4

కిరణ్ 4

అలాగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తొలుత రాష్ట్ర విభజన కోసం కేంద్ర హోం మంత్రికి లేఖ ఇచ్చి, ఆ తర్వాత సీమాంధ్ర ప్రజల్లో కలిగిన చైతన్యాన్ని చూసి, మాట మార్చి జై సమైక్యాంధ్ర అన్నారని వారు గుర్తు చేశారు.

కిరణ్ 5

కిరణ్ 5

చంద్రబాబు, జగన్‌లపై ప్రజలకు నమ్మకం లేదని వారు కిరణ్‌కు తెలిపారు. కొత్త పార్టీని స్థాపించేందుకు ఇదే సరైన సమయమని, ఆలస్యం చేస్తే వెనుకబడి పోతామని వారు ఆయనకు వివరించారు.

కిరణ్ 6

కిరణ్ 6

సార్వత్రిక ఎన్నికలకు ఇక రెండు నెలలే గడువు ఉన్నందున, ఇంత త్వరగా పార్టీని స్థాపించి ప్రజల్లోకి తీసుకెళ్ళడం అంటే సాధారణ విషయమేమీ కాదని పలువురు అనుమానాలు వ్యక్తం చేశారట.

కిరణ్ 7

కిరణ్ 7

మెజారిటీ ఎంపీలు, ఇతర నాయకులు ప్రజల్లో కిరణ్ పట్ల విశేషమైన ఆదరణ ఉన్నదని, సమైక్యాంధ్ర కోసం మొండి పట్టుదలగా పోరాటం చేశారన్న భావన ఉన్నదని వారు చెప్పారు.

English summary
AP caretaker CM Kiran Kumar Reddy on Sunday held talks with six MPs expelled from the Congress and state ministers loyal to him to chalk out his future course of action.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X