హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టి, జగన్: విశాఖలో కిరణ్ సభ, ముందడుగేస్తారా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్న రెండు నెలల అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బహిరంగ సభలో పాల్గొననున్నారట. సెప్టెంబర్ 30వ తేదిన ముఖ్యమంత్రి విశాఖపట్నంలో ఓ బహిరంగ సభలో పాల్గొనే అవకాశాలున్నాయి.

జూలై 30వ తేదిన కాంగ్రెసు పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి పలుమార్లు అధిష్టానం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాట్లాడారు. రెండు రోజుల క్రితం రాజ్యసభ టివికి ఇచ్చిన ఇంటర్వ్యూలోని పార్టీ కంటే రాష్ట్రం, ప్రజల ప్రయోజనాలు ముఖ్యమని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇప్పుడు విశాఖలో కిరణ్ బహిరంగ సభలో పాల్గొంటారనే అంశం చర్చనీయాంశమైంది. విభజనపై వేగంగా అధిష్టానం అడుగులు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో లాలూచీ ప్రచారం నేపథ్యంలో ఆయన విశాఖ సభపై చర్చ సాగుతోంది. తెలంగాణ నోట్ వస్తే ముఖ్యమంత్రి కొత్త పార్టీ పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు.

విభజనను కిరణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో అధిష్టానం ముందుకే వెళ్తే ఆయన ఎలాంటి ముందడుగైనా వేయవచ్చునని అంటున్నారు. గురువారం మంత్రులు గంటా శ్రీనివాస రాజు, బాలరాజులు కిరణ్‌ను కలిశారు. వారి మధ్య విశాఖ సభపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.

English summary

 The stage is set for Chief Minister Kiran Kumar Reddy’s first public appearance in the Seemandhra region on September 30 after the Congress Working Committee decided in favour of creating Telangana state about two months ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X