వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ భవిత చూసి.. రెండు, మూడేళ్ల తర్వాతే: కిరణ్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రెండు, మూడేళ్ల తర్వాతే రాజకీయ భవిష్యత్తు పైన నిర్ణయం తీసుకుంటానని మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి గురువారం చెప్పారు. గురువారం కిరణ్ కుమార్ రెడ్డితో భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కిషన్‌తో కిరణ్ పై వ్యాఖ్యలు చేశారు.

రెండు, మూడేళ్ల పాటు ఖాళీగానే ఉంటానని, కాంగ్రెసు పార్టీ పరిస్థితి, కేసుల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి భవితవ్యం, తెలుగుదేశం పార్టీ పైన ప్రజల అభిప్రాయాలు ఎలా ఉంటాయన్న అంశాలను బేరీజు వేసుకొని ఓ నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

 Kiran Kumar Reddy says he will decide after two years

తన మిత్రుడిని కలిసేందుకు గురువారం ఎమ్మెల్యే కాలనీకి వెళ్లానని పక్కనే కిరణ్ రెడ్డి ఇల్లు ఉండటంతో కలిశానని, రాజకీయ ప్రాధాన్యం లేదని కిషన్ రెడ్డి అనంతరం విలేకరులతో చెప్పారు.

కిషన్ రెడ్డి మాట్లాడుతూ... కిరణ్ కుమార్ రెడ్డిని తాను క్యాజువల్‌గానే కలిశానని చెప్పారు. తమ మధ్య ఎలాంటి రాజకీయపరమైన చర్చ జరగలేదన్నారు. పార్టీ విషయమై మాట్లాడుతూ.. మెదక్ లోకసభ అభ్యర్థిని అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. త్వరలో కొత్త కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.

English summary
Former CM Kiran Kumar Reddy says he will decide after two years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X