హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆకాశవీధిలో 'ఎపి' ఎయిర్ కోస్టా, కిరణ్ శ్రీకారం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎపికి చెందిన తొలి ఎయిర్ లైన్స్ కంపెనీ ఎయిర్ కోస్టాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దసరా పర్వదినం రోజు ప్రారంభించారు. సోమవారం శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ భవనంలో ముఖ్యమంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ఎయిర్‌కోస్టా సేవలకు శ్రీకారం చుట్టారు.

అనంతరం విజయవాడకు బయలుదేరిన ప్రారంభోత్సవ విమానానికి పచ్చజెండా ఊపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జెడి శీలం, శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్, రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ప్రసాద కుమార్, ఎయిర్‌కోస్టా చైర్మన్ లింగమనేని రమేష్, ఎల్ఈపీఎల్ చైర్మన్ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఎయిర్ కోస్టా ఎయిర్‌లైన్స్ వాణిజ్య సేవలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలుత విజయవాడ, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, జైపూర్, హైదరాబాద్‌లకు సేవలు ప్రారంభించనుంది. తర్వాత దశల వారీగా తన సేవలను పూణే, వైజాగ్, గోవా, మధురై, మైసూర్, తిరువనంతపురాలకు విస్తరించనుంది. విజయవాడకు చెందిన లింగమేని ఎస్టేట్స్ ప్రాజెక్ట్సు లిమిటెడ్ (ఎల్ఈపీఎల్) గ్రూపు ఎయిర్‌కోస్టాను ప్రమోట్ చేస్తోంది.

కిరణ్

కిరణ్

సోమవారం దసరా పర్వదినాన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన తొలి ఎయిర్ లైన్స్ 'ఎయిర్‌కోస్టా' సేవలను ప్రారంభించారు.

ఎయిర్ కోస్టా

ఎయిర్ కోస్టా

విజయవాడ, బెంగుళూరు ఎయిర్ కోస్తా సర్వీసును ఎల్ఈపిఎల్ సంస్థ మంగళవారం గన్నవరం విమానాశ్రయంలో లాంఛనంగా ప్రారంభించింది. ఉదయం 6.45 గంటలకు విజయవాడ(గన్నవరం) విమానాశ్రయం నుంచి బయలుదేరే ఈ విమానం 7.45 గంటలకు బెంగుళూరు చేరుకుంది.

ఎయిర్ కోస్టా

ఎయిర్ కోస్టా

తొలుత విజయవాడ విమానాశ్రయం డైరెక్టర్ బిజి పాటిల్ ఎయిర్ కోస్టా సంస్థ బోర్డింగ్ పాస్ కౌంటర్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

ఎయిర్ కోస్టా

ఎయిర్ కోస్టా

రాష్ట్రానికి చెందిన కంపెనీ ఎయిర్‌లైన్స్ రంగంలో ప్రవేశించటంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ కంపెనీ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.

English summary
The AP CM Kiran Kumar Reddy flagged off regional carrier Air Costa’s inaugural commercial flight from Hyderabad to Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X