బెదురొద్దు: సమైక్యంపై గెజిటెడ్ అధికారులతో సిఎం
హైదరాబాద్: ఎటువంటి హెచ్చరికలు, బెదిరింపులకు భయపడవద్దని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గెజిటెడ్ అధికారులకు సూచించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
సోమవారం గెజిటెడ్ అధికారుల ఫోరం అధ్వర్యంలో దాదాపు యాభై శాఖలకు చెందిన అధికారులు ముఖ్యమంత్రిని కలిశారు. సమైక్య రాష్ట్రంగా ఉంచేందుకు ముఖ్యమంత్రి చేస్తున్న కృషిని వారు అభినందించారు. ఈ ప్రయత్నంలో అంతిమ విజయం తప్పక సిద్ధిస్తుందని, అందువల్ల రాజీనామా చేయవద్దని వారు విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్, చుట్టుపక్కల ఉంటున్న సీమాంధ్ర ఉద్యోగులకు, అధికారులకు, సమైక్యాంధ్ర మద్దతుదారులకు తీవ్రమైన బెదిరింపులు వస్తున్నాయని, తమకు రక్షణ, భద్రత కల్పించాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ ఎవరికీ ఎటువంటి భయం అవసరం లేదని, రాష్ట్రాన్ని ఒకటిగా ఉంచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని స్పష్టంచేశారు.
దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న తరుణంలో విభజన అంశం రావడం దురదృష్టకరమన్నారు. కాగా, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ప్రాణాలు అర్పించిన వారి ఆత్మశాంతి కోసం ముఖ్యమంత్రి, అధికారులు రెండు నిముషాలు వౌనం పాటించారు. ఈ భేటీలో ఫోరం అధ్యక్షుడు ఎవి పటేల్, ఉపాధ్యక్షులు డి.వేణు, అనూరాధ, మురళికృష్ణ నాయుడు తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications