టి: గంటపాటు ప్రణబ్‌కు కిరణ్ వివరణ, ఢిల్లీకి ఘాటు లేఖ

హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆదివారం మధ్యాహ్నం కలిసి దాదాపు గంట పాటు విభజన సమస్యపై విన్నవించారు. మొదటి నుండి రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి అవకాశం ఉన్న ప్రతి అంశాన్ని వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు రాష్ట్రపతిని కలిసిన ముఖ్యమంత్రి పలు అంశాలతో పాటు ప్రధానంగా విభజన అంశాన్ని చర్చించినట్లుగా తెలుస్తోంది.

రాష్ట్రపతిని కలిసిన కిరణ్ విభజన వల్ల తలెత్తే సమస్యలను రాష్ట్రపతికి వివరించారని తెలుస్తోంది. విభజన జరిగితే ఇరు ప్రాంతాలకు నష్టం జరుగుతుందని, ప్రధానంగా తాగునీటి ప్రాజెక్టులు, నిరుద్యోగం, సరిహద్దుల వంటి పలు సమస్యలు వస్తాయని ఆయన వివరించారట.

Kiran Kumar Reddy

భద్రాచలం, హైదరాబాదు అంశాలపై రాష్ట్రపతితో కిరణ్ చర్చించారని సమాచారం. తెలంగాణ ముసాయిదా బిల్లులో పూర్తిస్థాయి వివరాలు లేవన్న అంశాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రణబ్ దాదా దృష్టికి తీసుకు వెళ్లారట. విభజనపై సమాంధ్ర ప్రజాప్రతినిధుల నుంచి వ్యక్తమవుతోన్న భయాందోళనలను ఆయనకు వివరించారట.

కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ

కాగా, రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లు సమగ్రంగా లేదని, వివరాలు పూర్తిగా లేవని రాష్ట్ర ప్రభుత్వం అధఇకారికంగా కేంద్ర హోంశాఖకు లేఖ రాసినట్లుగా వార్తలు వచ్చాయి. బిల్లులోని అంశాలపై అన్ని వివరాలను పంపితేనే సభలో చర్చ సాధ్యమని సభ్యులు పట్టుబడుతున్నట్లుగా అందులో పేర్కొన్నారని సమాచారం. ప్రభుత్వం కేంద్రానికి ఒకింత ఘాటుగానే లేఖ రాసినట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+