రేపు ఢిల్లీకి కిరణ్ రెడ్డి: తెలంగాణ నోట్‌పై చర్చకే?
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రేపు(మంగళవారం) ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని, కాంగ్రెసు అధిష్టానం పెద్దలను ఆయన ఢిల్లీలో కలుస్తారని సమాచారం. తెలంగాణపై రూపొందించిన కేబినెట్ నోట్‌పై చర్చకే ముఖ్యమంత్రిని కాంగ్రెసు అధిష్టానం ఢిల్లీకి ఆహ్వానించినట్లు చెబుతున్నారు.
ఈ నెల 19వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నోట్‌ను ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది. దానికి ముందు కిరణ్ కుమార్ రెడ్డితో చర్చించాలని అధిష్టానం పెద్దలు భావించినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన ఢిల్లీ వెళ్తున్నట్లు చెబుతున్నారు.
కాగా, సమైక్యవాదంపై మరింత ఒత్తిడి తీసుకువచ్చేందుకు సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు సోమవారం ఢిల్లీ చేరుకున్నారు. సమైక్యవాదాన్ని కాంగ్రెసు అధిష్టానం పెద్దలకు వినిపించేందుకు ప్రయత్నాలు చేపట్టారు. యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అపాయింట్ల కోసం నేతలు యత్నించారు.

కాగా, సోమవారం కావూరి సాంబశివరావు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే, కేంద్ర జౌళి శాఖ మంత్రి అయిన కావూరి సాంబశివరావు, రాష్ట్ర మంత్రి ప్రసాద కుమార్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో టెక్స్‌టైల్స్, చేనేత ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. జాతీయ టెక్స్‌టైల్ కార్పోరేషన్ రాష్ట్రంలో స్పిన్నింగ్ ప్రాసెస్, వేవింగ్ ప్రాజెక్టు కోసం 464 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్దంగా ఉందని కావూరి సాంబశివరావు చెప్పారు.
ఇదిలావుంటే, సీమాంధ్ర రాష్ట్ర మంత్రులు సోమవారం గంటా శ్రీనివాస రావు నివాసంలో సమావేశమై తాజా పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తాము కృషి చేస్తున్నట్లు తెలిపారు. తాము రెండు మూడు రోజుల్లో కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటామని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications