టిలో టిడిపి ఉండదు, ఉంటేగింటే: చరిత్ర తవ్విన కిషన్‌రెడ్డి

Kishan Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాదులో ధ్వజమెత్తారు. తమ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని తహతహలాడుతున్న కొన్ని పార్టీలే పొత్తులపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, ముఖ్యంగా టిడిపి ఇలాంటి ప్రచారానికి దిగుతోందని కిషన్ విమర్శించారు. ఇతర పార్టీలతో తమ పార్టీ పొత్తు పెట్టుకుంటోందంటూ వెలువడుతున్న వార్తలపై ఆయన అసహనం వెళ్లగక్కారు.

ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలకు బీజేపీ కేంద్ర బిందువుగా మారిందని, అందుకే అన్ని పార్టీలు తమ వైపు చూస్తున్నాయని, తామే పొత్తులకు ముందుకు వస్తున్నట్లు ప్రచారం చేస్తున్నాయని కానీ, తనకు తెలియకుండా ఎలాంటి పొత్తులు జరగవని స్పష్టం చేశారు. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు అన్ని సీట్లకు పోటీ చేస్తామని, పొత్తులపై జాతీయ స్థాయిలోగాని, రాష్ట్ర స్థాయిలోగాని ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరగలేదన్నారు.

రాష్ట్ర విభజన తర్వాత ఏ పార్టీ ఎటు పోతుందో తెలియదని, ఎలాంటి రాజకీయ సమీకరణాలు చోటు చేసుకుంటాయో చెప్పలేమని, ఇలాంటి అనిశ్చితిలో పొత్తుల గురించి మాట్లాడడం సరైంది కాదన్నారు. చేశారు. టిడిపితోతో బిజెపి పొత్తు పెట్టుకుంటుందని వెలువడుతున్న వార్తల గురించి ప్రస్తావించగా ఇప్పటివరకు తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో టిడిపి ఎక్కడా గెలవలేదని, అలాంటి పార్టీతో ఎలా పొత్తు పెట్టుకుంటామని ప్రశ్నించారు.

పొత్తులపై చంద్రబాబు బిజెపి జాతీయ నేతలతో చర్చలు జరుపుతున్నారన్నది కూడా అవాస్తవమన్నారు. బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయాక లాలూ ప్రసాద్ పార్టీ జార్ఖండ్‌లో జెండా ఎత్తేసిందని, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ విడిపోయాక మాయావతి పార్టీ, ములాయం సింగ్ పార్టీలు ఉత్తరాఖండ్‌లో ఉనికిని చాటుకోలేకపోయాయని, తనకు తెలిసి దేశ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ రెండు రాష్ట్రాల్లో ఉండడమనేది ఎప్పుడూ జరగలేదని, విభజన తర్వాత టిడిపి తెలంగాణలో ఉండదని, ఒకవేళ ఉంటే గింటే సీమాంధ్రలో ఉండవచ్చునన్నారు. రాష్ట్రం విడిపోయాక మా పార్టీకి సీమాంధ్ర అధ్యక్షుడు, తెలంగాణ అధ్యక్షుడు వేర్వేరుగా ఉంటారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+