కిషన్ రెడ్డి Vs విజయశాంతి, తెరాస నుండి ఎవరో?

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మెదక్ లోకసభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దేశంలో బిజెపి ప్రభంజనం... నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రభుత్వం ఏర్పడడంతో లోకసభకు వెళ్లాలని కిషన్ రెడ్డి భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఖాళీ చేసిన మెదక్ లోకసభ స్థానంపై కన్నేశారంటున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ లోకసభ, గజ్వేల్ అసెంబ్లీకి పోటీ చేసి రెండింటినీ కెసిఆర్ గెలుచుకొన్న విషయం తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్నందున మెదక్ ఎంపీగా రాజీనామా చేశారు.

Kishan Reddy eyes on Medak Lok Sabha

ఈ నేపథ్యంలో ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు కిషన్ రెడ్డి ఆసక్తితో ఉన్నట్లు సమాచారం. నిజానికి, ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల సమయంలోనే లోకసభ పోటీ చేయాలని కిషన్ రెడ్డి భావించారు.

సికింద్రాబాద్ లోకసభ స్థానం కోసం విఫలయత్నం చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. చివరకు అంబర్‌పేట అసెంబ్లీ స్థానానికి పోటీచేసి విజయం సాధించారు. అయితే, బిజెపి తరపున నిలబడి కెసిఆర్‌కు గట్టి పోటీ ఇచ్చిన నరేంద్ర నాథ్ మళ్లీ అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు. మరోవైపు కాంగ్రెసు పార్టీ నుండి విజయశాంతి పేరును పరిశీలిస్తున్నారు. తెరాస తమ అభ్యర్థి కోసం కసరత్తు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+