తెలంగాణ భవన్‌లో కూర్చుని...: కెసిఆర్‌పై కిషన్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో కూర్చుని ఉపన్యాసాలు ఇవ్వడమే పాలన కాదని, ఇకనైనా ప్రజాసమస్యలపై దృష్టి పెట్టాలని ఆయన కెసిఆర్‌ను ఉద్దేశించి అన్నారు. పోలవరం ముంపు ప్రాంతాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అప్పట్లో మౌనంగా ఉన్నారని ఆయన అన్నారు.
కుటుంబంతో సహా కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసినప్పుడు ఎందుకు ప్రస్తావించలేదని ఆయన ప్రశ్నించారు. కెసిఆర్ అప్పట్లో తెలంగాణ వస్తే చాలనే ధోరణిలో కెసిఆర్, మాజీ కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ వ్యవహరించారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు .

ఇప్పుడు ఇతర పార్టీలను, నాయకులను విమర్శించడం సరి కాదని కెసిఆర్‌కు సరి కాదని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం బిజెపి అనేక రకాలుగా పోరాటం చేసిందని ఆయన అన్నారు.
ముంపు ప్రాంతాల విలీన ప్రతిపాదనను తాము గతంలోనే వ్యతిరేకించామని చెప్పారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బిజెపి కృషి చేస్తుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications