హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్‌కి కౌంటర్: సీఎంలకి కిషన్ లేఖ, ద్రోహి అని తెరాస

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాదులో గవర్నర్ పాలనను వ్యతిరేకిస్తూ దేశంలోని పలు రాజకీయ పార్టీలను, పలువురు ముఖ్యమంత్రులను కలుపుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ భావించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా.. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాయాలని నిర్ణయించుకున్నారు. మోడీ పైన, బీజేపీ పైన కేసిఆర్ సంస్కారహీన విమర్శలు చేస్తున్నారని కిషన్ రెడ్డి మంగళవారం ధ్వజమెత్తారు.

గ్రేటర్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని తెరాస విమర్శలు చేస్తోందన్ారు. వాస్తవాలు తెలియజేసేందుకు 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉత్తరాలు రాస్తున్నట్లు చెప్పారు. హైదరాబాదు నగర శాంతిభద్రతల పైన గవర్నర్‌కు అధికారాలు కల్పిస్తూ విభజన బిల్లు రూపొందించినప్పుడు తమ పార్టీ నేత అరుణ్ జైట్లీ నాడు అభ్యంతరం చెప్పారని, అయితే ఎలాంటి సవరణలో కోరవద్దని కేసీఆర్ స్వయంగా కోరి ఇప్పుడు బురద జల్లుతున్నారని ఆరోపించారు.

తమ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వరుస విమర్శలకు దిగుతున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపైన మంగళవారం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి తీవ్రస్థాయిలో మండిపడింది. కిషన్‌రెడ్డి.. హైదరాబాద్‌లో పుట్టిన పక్కా తెలంగాణ ద్రోహి అని, వెంకయ్య శిష్యుడిగా తెలంగాణ వ్య తిరేక చర్యలకు పాల్పడుతున్నాడని విరుచుకుపడ్డారు.

Kishan writes to CMs against Chandrasekhar Rao

కిషన్‌రెడ్డికి దమ్ముంటే పోలవరం ముంపు మండలాల బదలాయింపు, ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌పై అధికారాలను గవర్నర్‌కు అప్పగించటంపై కేంద్రాన్ని, మోడీని, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని నిలదీయాలని సవాల్‌ చేశారు. హైదరాబాద్‌పై ఆంక్షలు పెడితే సీమాంధ్ర నేతలు ఇక్కడ అడుగుపెట్టలేరని, తమ సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు.

టీటీడీపీ నేతలు మోత్కుపల్లి, ఎర్రబెల్లి.. ఏపీ సీఎం చంద్రబాబు పెంపుడు కుక్కలని దుయ్యబట్టారు. పెద్ద మనుషుల పేర్లు తీసుకొని సీఎం కేసీఆర్‌ తనయుడికి కేటీఆర్‌ అని పేరు పెట్టారని, దీనిని రాజకీయం చేయడం సరికాదని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ధ్వజమెత్తారు.

టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి.. బ్లాక్‌మెయిలర్‌.. ఆయన కాంట్రాక్టర్లను బెదిరించి ఇళ్లు, ఆస్తులు పెంచుకుంటున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో 32వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని, వాటిని కప్పిపుచ్చుకోవటానికే తమ ప్రభుత్వంపై నోరుపారేసుకుంటున్నారన్నారు. రౌడీగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి తన వైఖరి మార్చుకోవాలని, లేకపోతే ఆయన బండారాన్ని బయటపెడ్తామని హెచ్చరించారు.

English summary
In a move to scuttle Telangana Chief Minister K. Chandrasekhar Rao’s plans of convening a chief ministers’ meeting to enlist their support against the Centre’s decision to grant special powers to the Governor, state BJP president G. Kishan Reddy has written individual letters to CMs stating that Mr Chandrasekhar Rao was spreading false information and wrongly accusing Prime Minister Narendra Modi for being a “fascist”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X