24న టిడిపి లోకి ఎంట్రీ : అరకు ఎంపీగా బరిలోకి : అశోక్ తో కిషోర్ చంద్ర దేవ్ భేటీ..!
కాంగ్రెస్ సీనియర్ నేత..కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్ర దేవ్ టిడిపిలో చేరే ముహూర్తం ఖరారైంది. ఈ నెల 24 ఆయన టిడిపి లో చేరుతున్నట్లుగా ప్రకటించారు. కిషోర్ చంద్ర దేవ్ టిడిపి లో చేరిక పై తనకు సమాచారం ఇవ్వక పోవటం తో కినుక వహించిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు తో టిడిపి అధినాయకత్వం సూచనల మేరకు కిషోర్ చంద్ర దేవ్ ఆయన తో సమావేశం అయ్యారు.
24న టిడిపిలో కిషోర్ చంద్ర దేవ్..
కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కిషోర్ చంద్ర దేవ్ టిడిపిలో చేరికకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 24 న కిషోర్ చంద్రదేవ్ టిడిపిలో చేరనున్నారు. కొంత కాలంగా కిషోర్ చంద్ర దేవ్ కాంగ్రెస్ విధానాలను విభేదిస్తూ పార్టీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా, ఈ నెల 12న ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు తో సమావేశమ య్యారు. ఆ సమ యంలోనే ఆయన టిడిపిలో చేరుతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఇక, కిషోర్ చంద్ర దేవ్ టిడిపిలోకి రాక పై తన కు సమాచారం ఇవ్వకపోవటంతో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు అసంతృప్తి వ్యక్తం చేసారు. రెండు రోజుల క్రితం టిడిపి పాలిట్ బ్యూరో సమావేశానికి గైర్హాజరయ్యారు. దీంతో..టిడిపి అధినాయకత్వం సూచనల మేరకు ఆయన విజయనగరంలో అశోక్ గజపతి రాజు నివాసానికి వెళ్లి ఆయన తో సమావేశం అయ్యారు. తనకు అశోక్ గజపతి రాజుతో కలిసి పని చేసే అవకాశం దక్కిందని చెప్పుకొచ్చారు.

అరకు ఎంపీగా..
టిడిపి లో చేరుతున్న కిషోర్ చంద్ర దేవ్ వచ్చే ఎన్నికల్లో అరకు ఎంపీగా పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. అదే హామీ పై ఆయన టిడిపిలో చేరుతున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేసిన కిషోర్ చంద్ర దేవ్ డిపాజిట్ కోల్పోయారు. 2014 ఎన్నికల్లో టిడిపి నుండి సంధ్యారాణి పోటీ చేయగా..వైసిపి నుండి కొత్తపల్లి గీత పోటీ చేసి గెలుపొందారు. గెలిచిన తరువాత గీత టిడిపిలోకి వెళ్లారు. కొంత కాలం క్రితం గీత సొంతంగా పార్టీ ఏర్పటు చేసారు. ఈ సారి ఎన్నికల్లో టిడిపి నుండి కిషోర్ చంద్ర దేవ్ ను బరిలోకి దింపాలని ఆ పార్టీ అధినాయకత్వం ఇప్పటికే నిర్ణయ తీసుకున్నట్లుగా గెలుస్తోంది. ఆయన నాలుగు సార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా పని చేసారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications