ఏడాది కూటమి పాలనపై కేకే సర్వే..డేంజర్ జోన్‌లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే..?
ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి అఖండ విజయం ఖాయమని కచ్చితమైన సర్వే ఫలితాలను అందించింది కేకే సర్వే. ముఖ్యంగా పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ పోటీ చేసిన అన్నీ స్థానాల్లో విజయం సాధిస్తుందని ముందే చెప్పి కేకే సర్వే సంచలనం సృష్టించింది. అలాగే కూటమికి 164 స్థానాలు వస్తాయని కేకే సర్వే ముందే ప్రకటించింది. కేకే సర్వే చెప్పినట్టుగానే ఎన్నికల ఫలితాలు రావడం అందరినీ ఆశ్చర్య పరిచింది.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా, కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ అధినేత కిరణ్ కొండేటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడిని కచ్చితంగా అంచనా వేసి గత ఎన్నికల ఫలితాలను సరిగ్గా చెప్పిన కేకే సర్వేస్, ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై కూడా తమ విశ్లేషణను పంచుకుంది.

తాజాగా 'పారావీల్' అనే తమ నూతన రియల్ టైమ్ పబ్లిజెన్స్ యాప్‌ను ప్రారంభించిన సందర్భంగా కిరణ్ కొండేటి మాట్లాడుతూ..జూన్ 4వ తేదీ తమ సంస్థకు చాలా ప్రత్యేకమైన రోజు అని పేర్కొన్నారు. గత ఏడాది ఇదే రోజున తమ సర్వే ఫలితాలు అక్షరాలా నిజమై, కూటమి విజయం సాధిస్తుందని తమ సంస్థ అంచనా వేసినట్లు గుర్తు చేశారు. ప్రజల నాడిని మా సర్వే ద్వారా వెల్లడించాం. అంతేగానీ మేము ఏ రాజకీయ పార్టీని సపోర్ట్ చేయడం లేదు, వ్యతిరేకించడం లేదని ఆయన స్పష్టం చేశారు.
సంవత్సరంలో 30 % తగ్గిన కూటమి ఎమ్మెల్యేల ఓట్ బ్యాంకు.!! pic.twitter.com/TWJ2vRgAaD
— వై.యస్.ఆర్ కుటుంబం™ (@_Ysrkutumbam) June 5, 2025
ప్రస్తుతం తాము సేకరించిన డేటా ప్రకారం, 19 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఏర్పడిందని కిరణ్ కొండేటి వెల్లడించారు. అయితే ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందనే విషయం మాత్రం ఆయన వెల్లడించలేదు. ఆశ్చర్యకరంగా కూటమికి మద్దతు ఇచ్చేవారిలో 7 శాతం మంది కూటమి నేతగా ఎన్టీఆర్ పేరు చెప్పారని తెలిపారు. అలాగే వైసీపీ మద్దతుదారుల్లో 21 శాతం మంది ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి, ముఖ్యంగా పారావీల్ యాప్ విడుదల సందర్భంగా ఈ సర్వే ఫలితాలు వెల్లడవడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications