జగన్‌పై కత్తితో దాడి: చంద్రబాబు ఏమన్నారంటే..?
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఎయిర్‌పోర్టు వెలుపల జరిగితే ఆ బాధ్యత ప్రభుత్వానిదని ఆయన స్పష్టం చేశారు. ఎయిర్‌పోర్టు లోపల జరిగితే బాధ్యత ఎవరిదన్నారు.
ఎయిర్‌పోర్టులో జరిగిన దాడి ఘటన కేంద్ర పరిధిలోకి వస్తుందన్నారు. ఈ దాడిని రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. దాడి జరిగిన వెంటనే గాయపడిన వ్యక్తి హైదరాబాద్ వెళ్లిపోయారన్నారు.

దాడి జరిగిన విధానం తెలుసుకోవడం దర్యాప్తులో భాగం కాదా? అని ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రంలోకి వెళ్లి ఎలా దర్యాప్తు చేయాలని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం పనిచేయకుండా కేంద్ర సర్కార్ కుట్రలు పన్నుతోందన్నారు. విపక్షాల కుట్రలను ఎదుర్కొంటూనే పరిపాలన సాగించాల్సి వస్తుందన్నారు.
అభివృద్ధి కోసం తాము పనిచేస్తుంటే ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని చంద్రబాబు అన్నారు. దాడి చేసిన వ్యక్తి ప్రభుత్వాన్ని తిడుతూ లేఖలు రాశారని, జగన్‌తో ఫొటోలు కూడా దిగాడని చెప్పారు. ఇప్పుడేమో తమను బ్లేమ్ చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.












Click it and Unblock the Notifications