దమ్ముందా?, పశ్చిమ దరిద్రం పోయింది: చంద్రబాబుకు కొడాలి సవాల్

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బుధవారం విజయవాడలో పశ్చిమ నియోజకర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి హాజరైన కొడాలని నాని మాట్లాడుతూ.. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం, సిగ్గు, లజ్జా ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి.. మళ్లీ ఎన్నికల్లో గెలిపించుకోవాలని సవాల్ విసిరారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌పై మండిపడ్డారు. జలీల్ ఖాన్ పార్టీ మారడం వల్ల పశ్చిమ నియోజకర్గానికి ఉన్న దరిద్రం పోయిందని కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకా ప్రతాప్ అప్పారావు, కె. పార్థసారథి, వంగవీటి రాధా, గౌతంరెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Kodali fires at Chandrababu and jaleel khan

పార్టీ మారి.. కల్లబొల్లి కబుర్లా: పెద్దిరెడ్డి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై ఆ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి చూసి వెళ్లామని.. కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని పార్టీ మారిన ఎమ్మెల్యేలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు.

గౌతంరెడ్డి మాట్లాడుతూ.. కృష్ణానదిలో నీరు ఎలా ఎండిపోతుందో... రేపు టీడీపీ కూడా అలాగే ఎండిపోతుందని ఎద్దేవా చేశారు. అలాంటి పార్టీలోకి జలీల్ ఖాన్ వెళ్లారని మండిపడ్డారు. ఆయన పార్టీని వీడినా... కార్యకర్తలు మాత్రం పార్టీలోనే ఉన్నారని స్పష్టం చేశారు.

వంగవీటి రాధా మాట్లాడుతూ... దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. మళ్లీ గెలవాలని జలీల్ ఖాన్‌కి వంగవీటి రాధా సవాల్ విసిరారు. జలీల్ ఖాన్ పార్టీ వీడి వెళ్లడం వల్ల పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందని మాజీ మంత్రి, కె.పార్థసారథి వ్యాఖ్యానించారు.

విశాఖ రైల్వే జోన్‌పై అవంతి ప్రతిన

విశాఖకు రైల్వే జోన్ రాకుంటే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఎంపీ అవంతి శ్రీనివాస్ బుధవారం తేల్చి చెప్పారు. విశాఖకు రైల్వే జోన్ వస్తుందన్న నమ్మకం ఉందన్నారు. ఆలస్యమైనా వస్తుందని, దీని కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఎన్టీపీసీ రెండో దశ పూర్తయితే ఏపీలో మిగులు విద్యుత్ ఉంటుందని చెప్పారు.

జగన్ అవినీతిపరుడు: పల్లె

తూర్పుగోదావరి: జగన్‌ ఓ అవినీతి పరుడని, అతడు ప్రతిపక్ష నేతగా ఉండటం దురదృష్టకరమని మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. జర్నలిస్టులు, ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+