వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పశువులకొట్టంలో కొడాలి నాని; పెరటితోటలో పుష్పశ్రీవాణి: మాజీ మంత్రులపై ఏపీలో హాట్ డిబేట్!!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి మంత్రివర్గ ఏర్పాటులో మంత్రిపదవులు దక్కించుకుని రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన మంత్రులు కొందరు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవులను కోల్పోయారు. ఆ తర్వాత వారు ఏం చేస్తున్నారు అన్నది రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరిలోనూ కనబడుతున్న ప్రధానమైన ఆసక్తి.

మొన్నటి వరకు మంత్రులుగా బిజీ.. ఇప్పుడేం చేస్తున్నారంటే

మొన్నటి వరకు మంత్రులుగా బిజీ.. ఇప్పుడేం చేస్తున్నారంటే

గతంలో కీలక మంత్రులుగా పని చేసి, జగన్ నిర్ణయంతో మంత్రివర్గంలో స్థానం కోల్పోయిన మంత్రులు మొన్నటి వరకూ కొనసాగిన బిజీ నుండి కాస్త రిలాక్స్ అవుతున్నట్లు గా కనిపిస్తున్నారు. మంత్రి పదవి పోయిందన్న బాధ మనసులో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి సైన్యం గా పనిచేస్తామని బయటకు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి విడతలో మంత్రిగా అవకాశం దక్కించుకున్న తర్వాత బోలెడంత కాంట్రవర్సీ లకు కేరాఫ్ గా మారిన మంత్రి కొడాలి నాని. రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి గా పని చేసిన కొడాలి నాని, చంద్రబాబును, లోకేష్ ను టార్గెట్ చేయడం తో ఎప్పుడూ వార్తల్లో నిలిచారు.

మంత్రి పదవి లేకున్నా జగన్ కోసం పని చేస్తానన్న మంత్రి కొడాలి నాని

మంత్రి పదవి లేకున్నా జగన్ కోసం పని చేస్తానన్న మంత్రి కొడాలి నాని

చంద్రబాబుపై, లోకేష్ పై ఘాటుగా విమర్శలు సంధించిన కొడాలి నాని గుడివాడలో క్యాసినో నిర్వహణ వంటి అనేక కాంట్రవర్సీల లోనూ ఇరుక్కున్నారు. మంత్రిగా పనిచేసిన సమయంలో ఎప్పుడూ బిజీగా ఉన్న కొడాలి నాని మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత తనకు మంత్రిగా అవకాశం దక్కకపోవడంతో ప్రస్తుతం రిలాక్స్ అవుతున్నారు. రెండో విడత లో మంత్రి పదవి నుంచి వైదొలగాలని వచ్చిన కొడాలి నానిలో మంత్రి పదవి పోయిందన్న అసంతృప్తి ఉన్నప్పటికీ, జగన్ కోసం తాను పని చేస్తానని తేల్చి చెప్పారు.

 పశువుల కొట్టంలో మంచంపై పడుకున్న కొడాలి నాని ఫోటో వైరల్

పశువుల కొట్టంలో మంచంపై పడుకున్న కొడాలి నాని ఫోటో వైరల్

ఇక తాజాగా ఆయన ఏం చేస్తున్నారు అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో కలుగుతున్న సమయంలో ఒక పశువుల కొట్టంలో మంచం పై పడుకొని ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనకు మంత్రి పదవి అవసరం లేదని, పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడం కోసం కృషి చేస్తానని చెప్పిన కొడాలి నాని, మంత్రి పదవి పోయిన తర్వాత అంతా యాక్టివ్ గా కనిపించడం లేదని టాక్ వినిపిస్తుంది.

కొడాలి నాని ఫోటోను ట్రోల్ చేస్తున్న టీడీపీ

కొడాలి నాని ఫోటోను ట్రోల్ చేస్తున్న టీడీపీ

కొడాలి నాని అభిమానులు పశువుల కొట్టం లో ఉన్న కొడాలి నాని ఇంతకాలం మంత్రిగా పనిచేసి, బిజీగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కాస్త రిలాక్స్ అవుతున్నారు అంటూ చెప్తుంటే, ఇక ప్రతిపక్ష పార్టీల నేతలు, ముఖ్యంగా టీడీపీ నేతలు కొడాలి నాని ఫోటో ను ట్రోల్ చేస్తున్నారు. జగన్ చివరకు కొడాలి నానిని పశువుల కొట్టానికి పరిమితం చేశారు అంటూ సెటైర్లు వేస్తున్నారు.

డిప్యూటీ సీఎంగా మొన్నటివరకు పుష్ప శ్రీవాణి బిజీ

డిప్యూటీ సీఎంగా మొన్నటివరకు పుష్ప శ్రీవాణి బిజీ

ఇదిలా ఉంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా మొదటి విడత మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న పుష్ప శ్రీవాణి, మంత్రివర్గ పునర్విభజనలో పదవిని కోల్పోయిన తర్వాత మాజీ అయిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు బిజీబిజీగా గడిపిన పుష్పశ్రీవాణి ప్రస్తుతం కాస్త రిలాక్స్ అవుతున్నట్లుగా కనిపిస్తున్నారు.

పెరటి తోటలో కూరగాయలు కోస్తూ రిలాక్స్ అవుతున్న మాజీ మంత్రి

పెరటి తోటలో కూరగాయలు కోస్తూ రిలాక్స్ అవుతున్న మాజీ మంత్రి


మన్యం పార్వతీపురం జిల్లా కురుపాం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆమె జియ్యమ్మవలస మండలం చినమేరంగి లోని తన ఇంటి ప్రాంగణంలో వేసిన పెరటి తోటలో వివిధ రకాల కూరగాయలు, టమాటాలను కోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. తాను సేకరించిన కూరగాయలతో నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన పుష్పశ్రీవాణి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో మంత్రి రెస్ట్ తీసుకుంటున్నారని అందరూ భావిస్తున్నారు. ఏదిఏమైనా మంత్రిపదవి పోయిందన్న బాధలో ఉన్న మాజీ మంత్రులు రకరకాల వ్యాపకాలతో తమని తాము అసంతృప్తి నుంచి బయటకు వచ్చేలా ప్రయత్నం చేస్తున్నారు అనేది నిర్వివాదాంశం.

English summary
Photos of former minister Pushpa Srivani in the backyard and former minister Kodali Nani in the cattle barn are going viral on social media. There is an interesting debate going on in the AP right now about what former ministers are doing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X