జగన్ సూచన -కొడాలి నాని నిర్ణయం వాయిదా..!!

వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని మౌనంగా ఉంటున్నారు. అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు, టీడీపీ లక్ష్యం విరుచుకుపడ్డ నాని తాజా ఎన్నికల్లో ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని గతంలో నే నాని ప్రకటించారు. ఇక, ఇప్పుడు వరుస కేసులు నమోదవుతన్న వేళ కొడాలి నాని పార్టీ అధినేత జగన్ తో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణ పైన చర్చించారు. ఆ తరువాత కొడాలి నాని రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నారు.

నాని కీలక ప్రకటన
కొడాలి నాని 2024 ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని గతంలో స్పష్టం చేసారు. 2029 ఎన్నికల్లో తాను పోటీ చేయనని ప్రకటించారు. అయితే, తాజా ఎన్నికల్లో కొడాలి నాని ఓడిపోయారు. కొద్ది రోజులుగా కొడాలి నాని పైన వరుసగా కేసులు నమోదువుతున్నాయి. కోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ కోసం అభ్యర్దిస్తున్నారు. ఈ సమయంలో కొడాలి నాని గతం కంటే భిన్నంగా పూర్తిగా మౌనం పాటిస్తున్నారు. ఇక..నాని గతంలో చేసిన ప్రకటన ఆధారంగా నాని రానున్న రోజుల్లో రాజకీయంగా పూర్తిగా దూరం అవుతారంటూ ప్రచారం మొదలైంది.

Kodali Nani meets YS jagan deiscussed on his previous statement over political retirement

జగన్ సూచనలతో
ఈ సమయంలో కొడాలి నాని తాజాగా మాజీ సీఎం జగన్ తో సమావేశమయ్యారు. తాజా పరిణామాల పైన చర్చించారు. ప్రస్తుతం పార్టీకి అండగా ఉండాల్సిన అవసరం ఉందని ముఖ్య నేతలకు జగన్ సూచించారు. దాడులు ఎదుర్కొంటున్న కేడర్ కు భరోసా ఇవ్వాలని నిర్దేశించారు. తాను జిల్లాల పర్యటనలకు వెళ్తానని వెల్లడించారు. జగన్ తో భేటీ తరువాత జిల్లాలో కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్లాలని కొడాలి నాని నిర్ణయించారు. ఈ మేరకు పేర్ని నానితోనూ చర్చలు చేసారు. పార్టీ పరంగానూ కార్యక్రమాలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు.

నాని నిర్ణయం ఏంటి
మరో వైపు కొడాలని నానికి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆయనపై పలు కేసులు నమోదు అయ్యాయి. కొడాలి నానితోపాటు ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వాసుదేవరెడ్డి, నాటి జాయింట్‌ కలెక్టర్‌ (జేసీ) మాధవీలతపై పోలీసులు కేసు పెట్టారు. ఈ మేరకు దుగ్గిరాల ప్రభాకర్‌ అనే వ్యక్తి వీరి ముగ్గురుపై ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై గుడివాడలో కేసు దాఖలైంది. తమను బెదిరించి బలవంతంగా రాజీనామాలు చేయించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కొడాలి నానిపై గుడివాడ వన్‌ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసులో నాని హైకోర్టును ఆశ్రయించారు. నోటీసులు ఇచ్చి విచారించాలని కోర్టు సూచించింది. కేసులు..రాజకీయంగా ఉక్కిరి బిక్కిరి అవుతున్న కొడాలి నాని ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+