వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త పదవిని తిరస్కరించిన కొడాలి నాని..!! జగన్ గ్యారేజీలోనే అంతా - అసలు కారణం ఇదే..!!

|
Google Oneindia TeluguNews

వైసీపీ ఫైర్ బ్రాండ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి పదవి తిరిగి దక్కని కొడాలి నానికి ...రాష్ట్ర స్థాయి పదవి ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. సీఎం జగన్ కేబినెట్ లో పాత మంత్రులకు 11 మందికి అవకాశం ఇవ్వగా.. కొత్తగా 14 మందిని తీసుకున్నారు. 11 మందిని తీసుకుంటున్న సమయంలో సీనియర్లు - అనుభవం అంశం ప్రాతిపదికగా మారింది. అదే సమయంలో సామాజిక - ప్రాంతీయ సమతుల్యతను పరిగణలోకి తీసుకున్నారు. చివరి నిమిషం దాకా కొడాలి నానికి మంత్రి పదవి ఖాయమని భావించారు. కానీ, అనూహ్యంగా క్రిష్ణా జిల్లా నుంచి జోగి రమేష్ కు మాత్రమే అవకాశం దక్కింది.

పదవులు కాదు..జగన్ కోసం పని చేస్తాం

పదవులు కాదు..జగన్ కోసం పని చేస్తాం

గత కేబినెట్ లో అవకాశం దక్కిన కమ్మ - క్షత్రియ - వైశ్య వర్గాలకు ఈ సారి మంత్రి పదవులు దక్కలేదు. దీంతో..కేబినెట్ మంత్రుల ప్రకటన సమయంలో ఆ వర్గాలకు ఏ రకంగా ప్రాధాన్యత ఇవ్వనుందీ వెల్లడించారు. అందులో భాగంగా కమ్మ వర్గానికి రాష్ట్ర స్థాయి పదవిని కేబినెట్ హోదాలో మాజీ మంత్రి కొడాలి నానికి ఇవ్వాలని నిర్ణయించారు.

ఏపి స్టేట్ డెవలప్‌మెంట్ బోర్డు చైర్మన్ గా కొడాలి నానికి అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, దీనిని కొడాలి నాని తిరస్కరించినట్లు విశ్వసనీయ సమాచారం. మంత్రి పదవులు రెండున్నారేళ్లే ఉంటాయని సీఎం జగన్ 2019 లో అప్పటి కేబినెట్ ఏర్పాటు సమయంలోనే స్పష్టం చేసిన అంశాన్ని కొడాలి నాని గుర్తు చేస్తున్నారు. తాము పదవుల కోసం వెంపర్లాడే వాళ్లం కాదని..జగన్ గ్యారేజీలో సీఎం కోసం సని చేస్తామని స్పష్టం చేసారు.

జగన్ గ్యారేజీలోనే తామంతా ఉంటామంటూ

జగన్ గ్యారేజీలోనే తామంతా ఉంటామంటూ

తనకు మంత్రి పదవి ఈకతో సమానమంటూ పలు సార్లు చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. తనకు మంత్రి పదవి ఉన్నా..లేకున్నా ఒకటేనని తేల్చి చెప్పారు. తనకు తాజాగా ఇచ్చిన పదవి విషయం పైన సీఎంతో చర్చిస్తానని వెల్లడించారు. అయితే, ఇప్పటికే తనకు పదవులు అవసరం లేదని..మంత్రి పదవి పోవటంతోనే...ఈ పదవి తీసుకున్నారనే అభిప్రాయం ఏర్పడటం తనకు ఇష్టం లేదని కొడాలి నాని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

తాను కేవలం గుడివాడ ఎమ్మెల్యేగానే కొనసాగుతూ జగన్ నాయకత్వంలో పని చేస్తానని చెబుతున్నారు. చంద్రబాబు లాగా సీఎం పదవుల కోసం... మంత్రి పదవుల కోసం తాను ఎటువంటి రాజకీయాలు చేయనని స్పష్టం చేసారు. జగన్ ది అరుదైన వ్యక్తిత్వమని ప్రశంసించారు. సామాజిక విప్లవం జగన్ చేసిన చూపిస్తున్నారన్నారు. బీసీ - ఎస్సీ - ఎస్టీలకు ప్రాధాన్యత ద్వారా కొత్త విప్లవానికి జగన్ నాంది పలికారని నాని చెప్పుకొచ్చారు.

పార్టీ బాధ్యతలకు ఓకే.. పదవి మాత్రం వద్దంటూ

పార్టీ బాధ్యతలకు ఓకే.. పదవి మాత్రం వద్దంటూ

అయితే, ఇప్పుడు నాని తనకు ఆఫర్ చేసిన మంత్రి పదవి వద్దని..తాను కేవలం ఎమ్మెల్యేగా ఉంటూ 2024 ఎన్నికల్లో తిరిగి వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు పని చేస్తానని స్పష్టం చేస్తున్నారు. కానీ, ఇదే సమయంలో సీఎం జగన్ ప్రతిపాదించిన పదవిని కొడాలి నాని తిరస్కరిస్తే...దాని పైన రాజకీయంగా చర్చకు కారణమయ్యే అవకాశం ఉంది.

కొడాలి నాని తనకు కేబినెట్ హోదాతో ఉన్న ఈ పదవి వద్దని చెబుతుండటంతో.. ఇక, పార్టీ పరంగా కొడాలి నానికి సీఎం జగన్ కొత్త పదవి - బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని పార్టీలో చర్చ సాగుతోంది. ఇక, ఈ విషయం పైన ఈ రోజు లేదా రేపు సీఎం జగన్ - కొడాలి నాని చర్చల తరువాత తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. క్రిష్ణా- గుంటూరు - ప్రకాశం జిల్లాల బాధ్యతలు కొడాలి నానికి అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.

English summary
Kodali Nani is not interested to take the new nominated post says sources and said that he would work in Jagans core team.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X