రాజకీయ వారసుడిని ప్రకటించిన కొడాలి నాని - జగన్ పై ఆ ఫ్యామిలీకి ఇష్టం ఎందుకంటే..!!
వైసీపీ ఫైర్ బ్రాండ్..మాజీ మంత్రి కొడాలి నాని కీలక అంశాలను వెల్లడించారు. రాజకీయంగా తన వారసుడు ఎవరో బయట పెట్టారు. రాజకీయాల్లో టీడీపీ - జనసేన నేతలు తనను టార్గెట్ చేస్తున్న సమయంలో తన కుటుంబ సభ్యులు ఎలా ఫీలవుతారో చెప్పుకొచ్చారు. గుడివాడ నియోజకవర్గంలో తన వారసుడిగా ఎవరు ఎంట్రీ ఇస్తున్నారనే విషయం చెబుతూనే.. ముఖ్యమంత్రి జగన్ పైన ఎవరైనా విమర్శలు చేస్తే తన కుటుంబ సభ్యుల రియాక్షన్ ఎలా ఉంటుందో వివరించారు.

టీడీపీ అందుకే విమర్శిస్తోంది
మాజీ మంత్రి కొడాలి నాని ఒక ఇంటర్వ్యూలో ఆసక్తి కర అంశాలను రివీల్ చేసారు. టీడీపీ - జనసేన తనను తిడుతున్నారు..టార్గెట్ చేస్తున్నారంటే తాను చాలా బలవంతుడిననే భావించాలన్నారు. పనికి మాలిన వాళ్లను ఎవరైనా పట్టించుకుంటారా అని ప్రశ్నించారు. జగన్ ను ఎవరైనా తిడుతుంటే తన తల్లి అసలు జీర్ణించుకోలేరని చెప్పుకొచ్చారు.
తాను రాజకీయాల్లో ఉండటంతో..తాను రియాక్ట్ అవ్వటంలో తాను తన కుటుంబ సభ్యుల కంటే బెటర్ గా ఫీలవుతానని చెప్పారు. తనకు ఇద్దరు కుమార్తెలని నాని చెప్పారు. ఇద్దరూ చదువుకుంటున్నారని వివరించారు. వారికి రాజీకీయాల పైన ఆసక్తి లేదన్నారు. తన సతీమణికి రాజకీయాలపైన ఇంట్రస్టు చూపరని..తమది ఉమ్మడి కుటుంబమని స్పష్టం చేసారు.

రాజకీయ వారసుడు ఎవరంటే
తనకు రాజకీయాలంటే ఇష్టం లేకపోయినా, తాను రాజకీయాల్లోకి వచ్చానని వివరించారు. తన కుమార్తెలతో పాటుగా తన సోదరుడి కుమార్తె - కుమారుడు తమతో కలిసే ఉంటారని..తనకు నలుగురు పిల్లలుగా భావిస్తాననన్నారు. తన సోదరుడు కుమారుడు అర్జున్ కు రాజకీయాలు అంటే ఆసక్తి ఉందని చెప్పారు.
తన రాజకీయ వారసుడిగా అర్జన్ ఉంటారని..అయితే, ఇప్పుడు చదువకుంటున్నారని వివరించారు. అర్జున్ తన రాజకీయ వారసుడిగా చెప్పిన కొడాలి నాని.. ఇప్పటికే జగన్ ప్రసంగాల పైన ఆసక్తి చూపిస్తున్నారని చెప్పుకొచ్చారు.
జగన్ అంటే తన కుటుంబంలో అందరికీ ఇష్టమని చెప్పారు. దీంతో..తన సోదరుడి కుమారుడి చదువు పూర్తయిన తరువాత తన రాజకీయ వారసుడిగా ఉంటారని స్పష్టం చేసారు. 2024 ఎన్నికల్లో మాత్రం గుడివాడ నుంచి కొడాలి నాని పోటీ చేయనున్నారు.

గుడివాడలో కొడాలి నాని లక్ష్యంగా
ఇటు టీడీపీ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ కొడాలి నానిని ఓడించాలనే లక్ష్యంతో ఉన్నట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, ఇప్పటి వరకు అక్కడ అభ్యర్ది ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన కొడాలి నాని లక్ష్యంగా ఇప్పటికే టీడీపీ అనేక విమర్శలు..ఆరోపణలు చేస్తోంది.
అయితే, అసెంబ్లీ వేదికగానే జగన్ తనకు కొడాలి నానితో ఉన్న అనుబంధాన్ని బయట పెట్టారు. మంత్రి పదవి నుంచి తప్పించినా.. కొడాలి నాని ఇప్పుడు పార్టీ సమన్వయకర్త హోదాలో కొనసాగుతున్నారు. అసలు తనకు మంత్రి పదవి లెక్క కాదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వైసీపీలో..తన వారుసుడు ఎవరో వెల్లడించి.. మరింత ఆసక్తి పెంచారు.












Click it and Unblock the Notifications