వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్, చంద్రబాబు కలిసినా ఊడేదేమీ లేదు-24 సీట్ల కోసమే వాళ్లపోరు-కొడాలి కామెంట్స్

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకమవుతున్నాయి. ముఖ్యంగా విపక్ష పార్టీలైన టీడీపీ-జనసేన పార్టీల మధ్య పొత్తు కోసం జరుగుతున్న ప్రయత్నాలు, ఈ క్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు ఇరు పార్టీలతో పాటు వైసీపీలో కూడా చర్చకు తావిస్తున్నాయి. దీంతో వైసీపీ నేతలు కూడా ఈ పొత్తుపై ఇప్పటి నుంచే తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇదే క్రమంలో వైసీపీ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఇవాళ స్పందించారు. పొత్తులకు సంబంధించి వైసీపీని టార్గెట్ చేస్తూ పని పాటలేని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోపణలు తిప్పి కొడతామని కొడాలి నాని తెలిపారు. పవన్ చెప్పే తీరులో ఎటువంటి లాజిక్ లేదన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ఎటువంటి వ్యతిరేక ఓటు లేదని కొడాలి పేర్కొన్నారు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన ప్రతి ఒక్క దాన్ని అమలు చేసినా, తమకు అనుకూల ఓటు మాత్రమే ఉందని ఆయన వెల్లడించారు.

kodali nani says hot comments on chandrababu and pawan kalyan tie up plans

ఇవాళ్టి నుంచి ప్రారంభమైన గడప గడపకూ వైసీపీ కార్యక్రమంలో పాల్గొన్న కొడాలి నాని.. దీని ఆవశ్యకతను తెలిపారు.
ప్రజల ఇతర అవసరాలు తెలుసుకునేందుకే గడపగడపకు మన ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని కొడాలి పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి పోటీ చేసినా.. విడిగా పోటీచేసినా తమకు ఊడేది ఏమీ లేదని కొడాలి హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీకి ఉన్న 151 సీట్లు మినహా మిగిలిన ఇరవై నాలుగు సీట్ల కోసమే ప్రతిపక్షాలు పోరాడాలని కొడాలి వ్యాఖ్యానించారు. వైసీపీకి ఎలాగో 151 సీట్లు తిరిగి వస్తాయని కొడాలి ధీమా వ్యక్తం చేశారు.

English summary
former ap minister kodali nani on today made hot comments on tdp-janasena's plans to tie up for 2024 elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X