దొంగలముఠా నాయకుడు చంద్రబాబు; మూడు రాజధానులపైనా కొడాలి నాని సంచలనం

టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్ పై చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు చదవని డిగ్రీతో పదోన్నతి పొందారని, ప్రస్తుతం ఆయన దొరికిపోవడంతో టిడిపీలో ఉలికిపాటు మొదలైందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. తాజాగా దొంగ సర్టిఫికెట్ తో అశోక్ బాబు ప్రమోషన్ పొందాడని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విమర్శించారు.

దొంగలను వెనకేసుకొస్తున్న ముఠా నాయకుడు చంద్రబాబు

దొంగలను వెనకేసుకొస్తున్న ముఠా నాయకుడు చంద్రబాబు

శుక్రవారం మీడియాతో మాట్లాడిన కొడాలి నాని ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు అశోక్ బాబు ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ పెట్టి ప్రమోషన్లు సంపాదించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అటువంటి దొంగలను వెనకేసుకొస్తున్న ముఠా నాయకుడు చంద్రబాబు అంటూ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అశోక్ బాబు అయినా చంద్రబాబు అయినా చట్టం ముందు సమానమే అంటూ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక అశోక్ బాబు పై ఫిర్యాదుచేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని, అశోక్ బాబు తో పని చేసిన సాటి ఉద్యోగి ఆయనపై ఫిర్యాదు చేశారని కొడాలి నాని పేర్కొన్నారు.

దొంగ సర్టిఫికెట్ తో పదవిని పొందడం తప్పు కాదా?

దొంగ సర్టిఫికెట్ తో పదవిని పొందడం తప్పు కాదా?

అశోక్ బాబు అరెస్టుపై తెలుగుదేశం పార్టీ గగ్గోలు చేస్తోందని, అవినీతిపరుడు కోసం టిడిపి తాపత్రయపడుతోంది అని మంత్రి కొడాలి నాని విమర్శించారు. అశోక్ బాబు దొంగ సర్టిఫికేట్ పెట్టి వేరే వాళ్లకి రావలసిన ప్రమోషన్ దొంగిలించారని ఆరోపించారు మంత్రి కొడాలి నాని. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ ప్రజలు భావోద్వేగాలకు గురి అయితే దానిని అడ్డం పెట్టుకుని ఉద్యోగ సంఘాల ముసుగులో చంద్రబాబుకు మద్దతు తెలిపి ఎమ్మెల్సీ పదవిని పొందారని కొడాలి నాని పేర్కొన్నారు. అశోక్ బాబు దొంగ సర్టిఫికెట్ తో పదవిని పొందడం తప్పు కాదా అంటూ ప్రశ్నించారు.

అశోక్ బాబు ఏం తప్పు చేశాడని నిస్సిగ్గుగా అడుగుతున్నాడు చంద్రబాబు

అశోక్ బాబు ఏం తప్పు చేశాడని నిస్సిగ్గుగా అడుగుతున్నాడు చంద్రబాబు

దొంగ సర్టిఫికెట్లతో పదవిని పొందిన వారిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెనకేసుకొచ్చి, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. అశోక్ బాబు దొంగ సర్టిఫికెట్ల వ్యవహారంపై ఎన్నికల సంఘం పరిశీలించి లోకాయుక్త కు సమాచారం అందించిందని, వారు ప్రాథమికంగా విచారణ జరిపిన తరువాత ఈ కేసును సిఐడికి అప్పగించారని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. ఇంటర్ చదివి, డిగ్రీ చదివినట్లు అశోక్ బాబు దొంగ సర్టిఫికెట్లు సృష్టించాడని, ఇక చంద్రబాబు అశోక్ బాబు ఏం తప్పు చేశాడని నిస్సిగ్గుగా అడుగుతున్నాడు అంటూ మండిపడ్డారు.

చంద్రబాబు నాయుడు, టిడిపి నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి

చంద్రబాబు నాయుడు, టిడిపి నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి

తప్పు చేశాడు కాబట్టే సీఐడీ అరెస్టు చేసిందని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. చంద్రబాబు కోసం అశోక్ బాబు ఎన్ని నీచమైన పనులు చేశారో తెలుసు అని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని చంద్రబాబు నాయుడు, టిడిపి నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.

మూడు రాజధానుల బిల్లు పెట్టి తీరుతాం: మంత్రి కొడాలి నాని

మూడు రాజధానుల బిల్లు పెట్టి తీరుతాం: మంత్రి కొడాలి నాని

ఇదే సమయంలో రాజధాని అంశం పైన కూడా మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని పై మరోసారి బిల్లు పెడతామని మంత్రి కొడాలి నాని తేల్చి చెప్పారు. ప్రతిపక్షాలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 3 రాజధానులు ఏర్పాటు జరిగి తీరుతుందని కొడాలి నాని వ్యాఖ్యానించారు. ప్రజల ఆమోదంతోనే మూడు రాజధానులు తీర్చిదిద్దుతామని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలతో మరోమారు మూడు రాజధానుల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+