వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమరావతి రైతులపై కొడాలి ఫైర్-వారిది ఆస్తుల పోరాటం-ఉత్తరాంధ్ర, సీమది ఆకలి పోరాటం..

|
Google Oneindia TeluguNews

అమరావతిలో ఏకైక రాజధాని కోరుతూ రైతులు చేస్తున్న పాదయాత్రపై నిరంతరం విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని ఇవాళ మరోసారి దీనిపై స్పందించారు. అమరావతి రైతుల పాదయాత్రను ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలతో పోలుస్తూ కొడాలి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆస్తులను కాపాడుకునేందుకే అమరావతి రైతుల పోరాటమని మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు. తన నియోజకవర్గం గుడివాడలో నిర్వహించిన గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న కొడాలి నాని.. అమరావతి రైతుల పాదయాత్రను మిగతా ప్రాంతాలతో పోల్చారు. ఉత్తరాంధ్ర ,రాయలసీమ ప్రజలది ఆకలి పోరాటమని కొడాలి వ్యాఖ్యానించారు. మరోవైపు చంద్రబాబు సృష్టించిన మాయా లోకమే భ్రమరావతి అని ఆయన తెలిపారు. రాష్ట్రం ముక్కలు కాకుండా చూడాల్సిన బాధ్యత మనదన్నారు.

kodali nani slams amaravati farmers fight for assets, need to maintain undivided state

గుడివాడ 17వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కొడాలి పాల్గొన్నారు. అధికార యంత్రాంగంతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆస్తుల కోసమే అమరావతి రైతుల ఆరాటమని, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలది ఆకలి పోరాటమని అన్నారు. తమ ఆస్తులు మాత్రమే పెరగాలని అమరావతి రైతులు, పెట్టుబడిదారులు ఆరాటపడుతున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో అందరూ బాగుండాలని సీఎం జగన్ కోరుకుంటున్నారని, అమరావతి రైతులు మాత్రం తామే బాగుండాలని విచిత్రంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రం ముక్కలు కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఆరు నూరైనా మూడు రాజధానులను కొనసాగిస్తామని కొడాలి నాని స్పష్టం చేశారు.

English summary
former ysrcp minister kodali nani on today made key comments on amaravati farmers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X