• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీలో అడ్రస్ లేని బీజేపీ.. తుప్పు చంద్రబాబు, పప్పు లోకేష్ ల చవితి రాజకీయం : కొడాలి నానీ ధ్వజం

|

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాల విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రగడ కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకి అని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తుంటే, కావాలని మత రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు.

Rashi Khanna : బ్యాక్ లెస్ టాప్ తో సైడ్ అరాచకం.. అందాల విందు చేస్తున్న బొద్దుగుమ్మ (ఫొటోస్)

 ఏపీలో కొనసాగుతున్న వినాయకచవితి రగడ

ఏపీలో కొనసాగుతున్న వినాయకచవితి రగడ


గణేశ మండపాలు ఏర్పాటు చెయ్యొద్దని, వినాయక నవరాత్రులు ఇళ్లలో మాత్రమే నిర్వహించుకోవాలని, ఇక పూజా సామాగ్రి కొనుగోలు వద్ద సామాజిక దూరం పాటించాలని, కరోనా ఆంక్షలు అమలు అవుతున్న నేపథ్యంలో బహిరంగ వేదికలపై ఉత్సవాలు నిర్వహించడం కూడదని ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో మద్యం షాపులకు లేని కరోనా, స్కూళ్ళు తెరవడానికి లేని కరోనా, పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, వర్ధంతులు, వివాహ వార్షికోత్సవ వేడుకలు జరుపుకోవడానికి లేని కరోనా వినాయక చవితి నిర్వహించుకోవడానికి అడ్డం వస్తుందా అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.

జగన్ సర్కార్ పై ఒత్తిడి పెంచుతున్న టీడీపీ, బీజేపీలు

జగన్ సర్కార్ పై ఒత్తిడి పెంచుతున్న టీడీపీ, బీజేపీలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందని అందుకే ఏ రాష్ట్రంలోనూ పెట్టని ఆంక్షలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెడుతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బీజేపీ, టీడీపీ నాయకులు.

నిన్నటికి నిన్న బీజేపీ నేతలు రాష్ట్రవ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుట్టి జగన్ సర్కార్ పై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఇక నేడు గవర్నర్ ను కలిసి వినాయక చవితి వేడుకలను నిర్వహించుకునే లా గవర్నర్ చొరవ చూపించాలని బిజెపి నేతలు విజ్ఞప్తి చేశారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతలు జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. లోకేష్ వినాయక చవితి వేడుకలను నిర్వహించుకునేలా అనుమతించాలని సీఎం జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.

 వినాయకచవితి రాద్ధాంతంపై కొడాలి నాని ధ్వజం

వినాయకచవితి రాద్ధాంతంపై కొడాలి నాని ధ్వజం

ఇక వినాయక చవితి వేడుకలపై రాష్ట్రంలో కొనసాగుతున్న రభస నేపథ్యంలో తాజాగా ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పందించారు. వినాయక చవితి పండుగ పై టీడీపీ, బీజేపీ నేతలు కావాలని అనవసర రాద్ధాంతం చేస్తున్నారని కొడాలి నాని రివర్స్ ఎటాక్ చేశారు. దేశమంతా వినాయక చవితికి ఏ నిబంధనలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవే నిబంధనలు ఉన్నాయని, కొడాలి నాని స్పష్టం చేశారు. కావాలని ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి అన్ని మతాల పట్ల గౌరవం ఉందని, అందరి మతవిశ్వాసాలను ఆయన గౌరవిస్తారని కొడాలి నాని పేర్కొన్నారు.

ఏపీలో అడ్రెస్ లేని బీజేపీ, తుప్పు చంద్రబాబు పప్పు లోకేష్ చవితి రాజకీయం .. నానీ ధ్వజం

ఏపీలో అడ్రెస్ లేని బీజేపీ, తుప్పు చంద్రబాబు పప్పు లోకేష్ చవితి రాజకీయం .. నానీ ధ్వజం


ఏపీలో అడ్రస్ లేని బీజేపీ కూడా రాజకీయ చేస్తోందంటూ, విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తోంది అంటూ కొడాలి నాని ధ్వజమెత్తారు. సోము వీర్రాజు కి విగ్రహాలతోనూ , వినాయకచవితి తోనూ రాజకీయం చేయడం అలవాటు అంటూ కొడాలి నాని విమర్శించారు. ఇక తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబు నారా లోకేష్ ని టార్గెట్ చేసిన కొడాలి నాని తుప్పు చంద్రబాబు, పప్పు లోకేష్ లు వినాయకచవితిపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

    Manda krishna said the only one to hold a Dalit empowerment conference to divert public attention
    కరోనాతో ఇబ్బందులు వస్తే రాజకీయాలు చెయ్యటం కోసమే డ్రామాలు

    కరోనాతో ఇబ్బందులు వస్తే రాజకీయాలు చెయ్యటం కోసమే డ్రామాలు


    చంద్రబాబు లోకేష్ లు శవం ఎక్కడ దొరుకుతుందా అని ఎదురుచూస్తూ ఉంటారని ఎద్దేవా చేశారు. అంతేకాదు కరోనాతో ప్రజలకు ఇబ్బందులు వస్తే రాజకీయాలు చేయడం కోసం ఇప్పుడు ఈ డ్రామాలాడుతున్నారని కొడాలి నాని విమర్శించారు. ప్రజల సంక్షేమం కోసం జగన్ మోహన్ రెడ్డి పని చేస్తుంటే వినాయక చవితి విషయంలో పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కొడాలి నాని.

    English summary
    Kodali Nani has made a reverse attack on the Vinayaka Chaviti festival celebrations controversy saying that TDP and BJP leaders are making unnecessary remarks. Kodali Nani clarified that AP has the same rules as there are for Vinayaka Chavati all over the country. Kodali Nani said that BJP which has no adress in AP, Thuppu Chandrababu and Pappu Lokesh, are politicizing Vinayakachavithi.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X