వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీవ్రవాది అయితే కాల్చి పడేస్తారు - పవన్ వ్యాఖ్యలపై కొడాలి నాని సంచలనం..!!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యల పైన మంత్రి కొడాలి నాని సీరియస్ అయ్యారు.తీవ్రవాదులను కాల్చి పడేస్తారని వ్యాఖ్యానించారు.

|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యల పైన మంత్రి కొడాలి నాని సీరియస్ అయ్యారు. రిపబ్లిడ్ డే రోజు పవన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తామంటే చూస్తూ కూర్చోమని.. వేర్పాటు ధోరణితో మాట్లాడితే తన లాంటి తీవ్రవాదిని చూడరని..తోలు తీసి కూర్చోబెడతామంటూ వ్యాఖ్యానించారు. దీని పైన ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. తీవ్రవాదులు ఉంటే ప్రభుత్వాలు చూస్తూ కూర్చోవన్నారు. తీవ్రవాదులను కాల్చి పడేస్తారని వ్యాఖ్యానించారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలని అడిగితే పవన్ కళ్యాణ్ ప్రజలను చంపేస్తారా అంటూ కొడాలి నాని ఫైర్ అయ్యరు.

తమ అభిప్రాయాలను చెప్పుకోవటానికి ప్రజలు రెడ్డెక్కితే పవన్ ఏం చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రం ముక్కలు కాకుండా ఉండేందుకే తాము మూడు ప్రాంతాలకు మూడు రాజధానుల తో అభివృద్ధి వికేంద్రీకరణ విధానం తీసుకొస్తున్నామని కొడాలి నాని చెప్పుకొచ్చారు. విభజనకు వ్యతిరేకమని చెబుతున్న వ్యక్తి రాష్ట్ర విభజనకు వత్తాసు పలికిన పార్టీల చంక ఎందుకు ఎక్కారని నాని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రం లక్షల కోట్లు తెచ్చి అమరావతిలోనే పెడతాం అంటున్నారని..రేపు ఈ ప్రాంతంలో ఉన్న నా లాంటి వాళ్ళు పొమ్మంటే రాష్ట్ర పరిస్థితి ఏమవుతుందని నిలదీసారు. హైదరాబాద్ నుంచి ఎందుకు రావాల్సి వచ్చిందని నాని ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞానని ఎద్దేవా చేసారు.

Kodali Nani slams Pawan Kalyan over terrorist remarks: Whats wrong in asking a seperate state,will he shoot the people

వైసీపీకి రాష్ట్రంలో 55 శాతం ఓటు బ్యాంకు ఉందని కొడాలి నాని చెప్పుకొచ్చారు. అందరూ కట్టకట్టుకొని వచ్చినా.. ఎవరూ ఏం చేయలేరని నాని ధీమా వ్యక్తం చేసారు. బతికి ఉన్నతం కాలం ఈ రాష్ట్రానికి జగనే ముఖ్యమంత్రిగా ఉంటారని నాని చెప్పుకొచ్చారు. చంద్రబాబు..లోకేష్ పైన నాని ఫైర్ అయ్యారు. పాదయాత్రలే కాదు.. పొర్లు యాత్రలు చేసినా ప్రజలు వారిని పట్టించుకొనే పరిస్థితిలో లేరని మండిపడ్డారు. గుడివాడలో క్యాసినో ఉందంటూ రాష్ట్రపతి..ఈడీ వరకు అందరికీ లేఖు రాసారని..చివరకు ఏమైందని..తనను ఏమైనా చేయగలిగారా అంటూ ప్రశ్నించారు. అభివృద్ధి అంటే స్విమ్మింగ్ పూల్ లో ఫారిన్ అమ్మాయిలను పెట్టుకుని మందు తాగటం కాదని వ్యాఖ్యానించారు.

English summary
Former Minister Kodali Nani serious on Pawan Kalyan over terrorist remarks, asks will he shoot the people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X