పవన్ కల్యాణ్ కు ఏం జరిగినా - కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముప్పు ఉందంటూ ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి. ఇప్పటికే ఈ అంశం పైన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. టీడీపీ - జనసేన నేతలు వైసీపీ లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్నాయి. ఇప్పుడు వైసీపీ ఫైర్ బ్రాండ్.. మాజీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేసారు. సానుభూతి రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ఆరితేరిపోయారనిపేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ చుట్టూ చంద్రబాబు ఏర్పాటు చేసిన వలయం ఉందని వ్యాఖ్యానించారు.
నాని.. పవన్ కల్యాణ్ కు ఏం జరిగినా అంటే మంచి జరిగినా.. చెడు జరిగినా చంద్రబాబుదే బాధ్యత అని కొడాలి నాని స్పష్టం చేశారు. పవన్ పై రెక్కీనిర్వహిస్తున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అనటం హాస్యాస్పదంగా కొట్టి పారేసారు. కుట్ర చేస్తే అది చంద్రబాబే చెయ్యాలని వ్యాఖ్యానించారు. అయ్యన్న పాత్రుడు అరెస్ట్ విషయంలో టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను కొడాలి నాని ఖండించారు. ఫోర్జరీ చేసిన అయ్యన్నను అరెస్టు చేస్తే చంద్రబాబు వక్ర భాష్యం చెబుతున్నారని మండిపడ్డారు. తప్పు ఎవరు చేసినా శిక్షార్హులేనని పేర్కొన్నారు. అయ్యన్నపాత్రుడికి ఒక న్యాయం చంద్రబాబుకు ఒక న్యాయం ఉండదన్నారు. బీసీలపై దాడి, అర్ద్రరాత్రి అరెస్ట్ అంటూ చంద్రబాబు అర్దం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

ప్రజా ప్రతినిధులు, పలుకుబడిగత నేతలను పోలీసులు రాత్రి వేళళ్లోనే అదుపులోకి తీసుకుంటారని కొడాలి నాని చెప్పుకొచ్చారు. ఇదే వ్యవహారంలో టీడీపీ విమర్శలను వైసీపీ నేతలు తిప్పి కొట్టారు. పోర్జరీ చేయటం తప్పు కాదా అంటూ మంత్రి జోగి రమేశ్ ప్రశ్నించారు. అయ్యన్న తప్పు చేస్తే బీసీలకు ఏం సంబంధమని నిలదీసారు. ఫోర్జరీ పత్రాలతో అయ్యన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే చూస్తూ ఊరుకోవాలా అని మరో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు టీడీపీ పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. తప్పు కప్పి పుచ్చుకొనేందుకే టీడీపీ నేతలు అయ్యన్న అరెస్ట్ విషయంలో రాద్దాంతం చేస్తున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల క్రిష్ణ విమర్శించారు.












Click it and Unblock the Notifications