"జైలుకెళ్లినా!, జగన్‌తో కాపురం ఎలా చేస్తుందో.. మీ వదినను అడుగు"
18నెలల జైలు జీవితం గడిపిన జగన్‌తో వదిన కాపురం ఎలా చేస్తుందో షర్మిల తెలుసుకోవాలని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఘాటుగా విమర్శించారు.
విజయవాడ: వైసీపీ ప్లీనరీ తర్వాత ఏపీలో ఎన్నికల వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీ పూరించిన సమర శంఖానికి ఇటు అధికార పార్టీ కూడా గట్టిగానే బదులిస్తోంది. రెండు పార్టీలు.. మాటల యుద్దంలో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ప్లీనరీ వేదికగా ప్రతిపక్ష పార్టీ చేసిన వ్యాఖ్యలను టీడీపీ మూకుమ్మడిగా తిప్పికొడుతోంది.
తాజాగా వైసీపీ రాజకీయాలను ఎద్దేవా చేస్తూ.. ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీని విమర్శించే ముందు.. 18నెలల జైలు జీవితం గడిపిన జగన్‌తో వదిన కాపురం ఎలా చేస్తుందో షర్మిల తెలుసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.

'తనకు జన్మనిచ్చిన తండ్రిని వెన్నుపోటు పొడిచి.. ఆయన పదవి పోవటానికి, మరణానికి కారకుడైన భర్త చంద్రబాబును సహిస్తున్న భువనేశ్వరికి నిజంగా చేతులెత్తి దణ్ణం పెట్టాలని' షర్మిల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కొల్లు రవీంద్ర ఇలా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
ఇక మద్య నిషేధం హామిని ప్రస్తావిస్తూ.. ముందు తన పక్కనున్నవాళ్లతో జగన్ తాగుడు మాన్పించాలని రవీంద్ర ఎద్దేవా చేశారు. రాజకీయం చేతగాకనే ప్రశాంత్ కిశోర్ ను తీసుకొచ్చుకుని విమర్శించారు.
Recommended Video


రుణమాఫీపై జగన్ అవాస్తవాలు:
ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ప్రజలకు అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. పావలా వడ్డీ కూడా లేకుండా చంద్రబాబు రుణమాఫీ చేశారని అన్నారు. రుణమాఫీ అమలులో మొత్తం దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. రెవెన్యూ లోటు ఉన్నా.. రుణమాఫీని అమలు చేసి చూపించామని స్పష్టం చేశారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications