లేకుంటే జైలుకెళ్లేవారు: కిరణ్‌పై కోమటిరెడ్డి, భ్రమ: జానా

సత్తా లేదా: ఎర్రబెల్లి
సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు విభజన ముసాయిదా బిల్లు చర్చకు రాకుండా మొండివాదన చేయొద్దని, కావాలనే అలా చేస్తున్నారని, చర్చలో మీ వాయిస్ చెప్పాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. మొండిగా వాదిస్తే సత్తా లేనట్లే అన్నారు. మీకు చేతులెత్తి మొక్కుతున్నానని, సహకరించాలని కోరారు.
సస్పెండ్ చేయాలి: హరీష్, ఈటెల
బిఎసి సమావేశంలో బిల్లుపై చర్చకు పార్టీలు అంగీకరించాయని తెరాస ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, హరీష్ రావులు చెప్పారు. చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్ జగన్‌లు కుట్రలు చేస్తున్నారని, వారికి రాజకీయాలు తప్ప సీమాంధ్రకు న్యాయం చేయాలనే ఆలోచన లేదన్నారు. చర్చను అడ్డుకునే వారిని సస్పెండ్ చేయాలన్నారు.
అది భ్రమే: జానా రెడ్డి
జవనరి 23వ తేదీ వరకు అసెంబ్లీలో చర్చ జరిగితే విభజన ఆగుతుందని భావిస్తే భ్రమేనని మంత్రి జానా రెడ్డి అన్నారు. ఓటాన్ బడ్జెట్ సమావేశాల్లో బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలుపుతుందన్నారు. అసెంబ్లీ మాటలకు ప్రయోజనం ఉండదన్నారు. విభజన తర్వాత తమ నాయకుడిని అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు.












Click it and Unblock the Notifications