చంద్రబాబును కలిసిన కొణతాల, విభజనపై రాష్ట్రపతిని కలిసిన చిరంజీవి
హైదరాబాద్: మాజీ మంత్రి, విశాఖ జిల్లా సీనియర్ రాజకీయ నాయకుడు కొణతాల రామకృష్ణ గురువారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఆయన త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారు. తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు చేరుతారనే విషయమై చర్చించేందుకు భేటీ అయినట్లుగా తెలుస్తోంది. కొణతాల టిడిపిలోకి ఎప్పుడు వస్తారనే విషయం తేలాల్సి ఉంది.
రాష్ట్రపతిని కలిసిన చిరంజీవి తదితరులు
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు చిరంజీవి, కిల్లి కృపారాణి, కెవిపి రామచంద్ర రావు తదితరులు గురువారం నాడు కలిశారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల పైన కేంద్రం ముందుకు సాగడం లేదని, జోక్యం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే.

అమరావతి బృహత్ ప్రణాళికపై నోటిఫికేషన్: నారాయణ
అమరావతి బృహత్ ప్రణాళికపై సీఆర్డీఏ గురువారం రాత్రి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి బృహత్ ప్రణాళికపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ... నోటిఫికేషన్ విడుదల తర్వాత 30రోజుల్లోగా ప్రజలు మార్పులు చేర్పులు సూచించవచ్చన్నారు. బృహత్ ప్రణాళిక అనంతరం భూమి ఇచ్చిన రైతులకు ఫ్లాట్లు కేటాయిస్తామన్నారు.












Click it and Unblock the Notifications