టార్గెట్ 2019! బుజ్జగిస్తున్నాం, బాబు మాటే ఫైనల్: కోణతాల చేరికపై గంటా

విశాఖ/విజయవాడ: మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. కొణతాల చేరికకు ముహూర్తం కూడా ఖరారైంది. సంక్రాంతి పండుగ తర్వాత ఆయన సైకిల్ ఎక్కనున్నారు. కొణతాల చేరికతో అసంతృప్తులు సహజమేనని, చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అంటున్నారు.

కొణతాల చేరిక పైన విశాఖలో అసంతృప్తి బయటపడింది. ఈ నేపథ్యంలో దీనిపై మంత్రులు గంటా శ్రీనివాస రావు, అయ్యన్న పాత్రుడులు మంగళవారం నాడు స్పందించారు.

పార్టీలోకి కొత్తవారు వచ్చేటప్పుడు అసంతృప్తులు సహజమేనని గంటా చెప్పారు. కార్యకర్తలను, స్థానిక నాయకులను బుజ్జగించే పనిలో అధిష్టానం ఉందని చెప్పారు. అసంతృప్తులు ఉన్నప్పటికీ పార్టీ నిర్ణయమే ఫైనల్ అని చెప్పారు.

Konathala Ramakrishna to join TDP after Sankranthi

ఇవన్నీ టీ కప్పులో తుఫాను వంటివి అని గంటా శ్రీనివాస్ రావు చెప్పారు. కొణతాల కాంగ్రెస్ పార్టీలో చేరుతారని మరో మంత్రి అయ్యన్న పాత్రుడు చెప్పారు. సంక్రాంతి తర్వాత ఆయన చేరిక ఉంటుందన్నారు. ఎవరైనా పార్టీలో చేరినప్పుడు అసంతృప్తులు సహజమేనని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయమే ఫైనల్ అన్నారు.

బండారుకు చంద్రబాబు హామీ

పార్టీలో కొత్త వాళ్లను చేర్చుకోవాలన్నది విధాన పరమైన నిర్ణయమని, అప్పుడే 2019 ఎన్నికలను సులువుగా ఎదుర్కోగలమని, అలాగని ఇప్పుడున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు కొత్త వాళ్ల పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఎవరైనా ఆటంకాలు సృష్టిస్తే వెంటనే బయటకు పంపేందుకు వెనుకాడేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు.

కొణతాల రామకృష్ణతో పాటు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీని పార్టీలో చేర్చుకోవాలన్న పార్టీ నిర్ణయంపై తీవ్ర మనస్థాపంతో ఉన్న ఎమ్మెల్యే బండారును రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కళా వెంకటరావు సోమవారం మధ్యాహ్నం విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయానికి తీసుకెళ్లారు.

ముప్పావు గంట పాటు భేటీ జరిగింది. ఈ భేటీలో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ పరంగా గతంలో నియోజకవర్గంలో ఎదుర్కొన్న పలు సమస్యలను బండారు ప్రస్తావించారు. ఆ సమయంలో పార్టీ శ్రేణులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని వివరించారు. అలాంటి వ్యక్తిని తీసుకోవడంపై కార్యకర్తలు మనస్థాపానికి గురయ్యారని పేర్కొన్నారు.

దీనిపై స్పందించిన చంద్రబాబు కొత్త చేరికలపై ఎవరికీ ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పార్టీ తగిన జాగ్రత్తలు తీసుకుంటుందన్నారు. ఈ మేరకు స్పష్టమైన సూచనలు, పార్టీ విధానాలను వివరించాకే చేర్చుకుంటామన్నారు.

ఒకరి నియోజకవర్గంలో మంత్రులు, ఎంపీలు, వేరొక ఎమ్మెల్యేలు జోక్యం చేసుకున్నా ఉపేక్షించేలేదన్నారు. ఇప్పుడు చేరుతున్న నాయకులతో పార్టీ మరింత బలోపేతమై, 2019 ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేలుగా విజయం సాధించే వీలుంటుందన్నారు. పార్టీ ప్రయోజనాలు కూడా ఆలోచించాల్సి ఉందన్నారు.

బండారు మరోసారి జోక్యం చేసుకొని గత 30 ఏళ్లుగా పార్టీని నమ్ముకొని పని చేస్తున్నానని, ఏ రోజూ పార్టీ విధానాలను వ్యతిరేకించలేదన్నారు. గంటా శ్రీనివాస్ రావు, పంచకర్ల రమేశ్ బాబును చేర్చుకునే సమయంలోనూ స్వాగతించానన్నారు.

బాబ్జీ పరంగా గతంలో నియోజకవర్గంలో శ్రేణులు తగిన ఇబ్బందులు ఎదుర్కొన్నందునే గట్టిగా ప్రస్తావించాల్సి వస్తోందన్నారు. ఎవరిపరంగా ఎలాంటి ఇబ్బందులుండవని, ఎలాంటి సమస్యలొచ్చినా తన దృష్టికి తీసుకురావాలని చంద్రబాబు సూచించారు. దీంతో వారి చేరికలపై బండారు కాస్త మెత్తబడినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+