డిగ్గీ సమక్షంలో సభ: కొండాసురేఖ రాకపోవడం వెనుక..!
హైదరాబాద్: వరంగల్ జిల్లా హన్మకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో శనివారం జరిగిన తెలంగాణ కాంగ్రెసు పార్టీ కృతజ్ఞత సభకు ఇటీవలే ఆ పార్టీలో చేరిన మాజీ మంత్రి కొండా సురేఖ హాజరు కాలేదు. ఈ సభ విజయవంతమైంది. గ్రూపు రాజకీయాలను పక్కన పెట్టి తెలంగాణ ప్రాంత, జిల్లా నాయకులు సభను సక్సెస్ చేశారు. హేమాహేమీలు ఈ సభకు తరలి వచ్చారు.
జైపాల్ రెడ్డి, జానా రెడ్డి, షబ్బీర్ అలీ, గుత్తా సుఖేందర్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఎంపీ రాజయ్య, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎంపి అంజన్ కుమార్ యాదవ్, మంత్రి సుదర్శన్ రెడ్డి తదితర నేతలు అందరూ తరలి వచ్చారు. జిల్లాలో సభ ఏర్పాటు చేసినప్పటికీ కొండా దంపతులు మాత్రం రాలేదు.

వీరు రాకపోవడానికి కూడా ఓ కారణం ఉందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ ముఖ్య అతిథిగా వారు వచ్చే నెలలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారట. ఇప్పుడు కాంగ్రెసులోని నేతలతో కొండా దంపతులకు సంబంధాలు అంతంత మాత్రమే.
ఈ నేపథ్యంలో ఆ సభకు వెళ్లక పోవడమే మంచిదని వారు నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం సాగుతోంది. తమ నియోజకవర్గంలోనే భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి డిగ్గీని ఆహ్వానించి ఘనంగా కాంగ్రెసు పార్టీలోకి పునరాగమనాన్ని చాటాలని వారు భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాతే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని చూస్తున్నారట.












Click it and Unblock the Notifications